టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి : డీఈవో విజయేంద్రరావు

ABN , First Publish Date - 2022-12-31T00:42:42+05:30 IST

2023 ఏప్రిల్‌ నెలలో జరిగే టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో జిల్లా వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఎంఈవోలు, హెచ్‌ఎంలు కృషి చేయాలని డీఈవో విజయేంద్రరావు సూచించారు.

టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి : డీఈవో విజయేంద్రరావు
మాట్లాడుతున్న డీఈవో విజయేంద్రరావు

చిత్తూరు (సెంట్రల్‌), డిసెంబరు 30: 2023 ఏప్రిల్‌ నెలలో జరిగే టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో జిల్లా వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఎంఈవోలు, హెచ్‌ఎంలు కృషి చేయాలని డీఈవో విజయేంద్రరావు సూచించారు. విద్యాశాఖ టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన నేపథ్యంలో శుక్రవారం ఆయన తన ఛాంబర్‌లో పరీక్షల సహాయ కమిషనర్‌ గురుస్వామిరెడ్డి, మదనపల్లె ఏడీ కృష్ణప్పలతో సమావేశం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ 2022-23 విద్యా సంవత్సరంలో కేవలం ఆరు పేపర్లతోనే టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. చిత్తూరు జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో 21,965 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. జనవరి 2 నుంచి సమ్మేటివ్‌ పరీక్షల అనంతరం టెన్త్‌ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి సబ్జెక్టుల వారీగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు.

Updated Date - 2022-12-31T00:42:45+05:30 IST