Somu Veerraju: చాగంటి కోటేశ్వరరావు ఏ అవార్డుకైనా అర్హులే

ABN , First Publish Date - 2022-11-27T17:49:36+05:30 IST

ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao)ను గురజాడ పురస్కారానికి ఎంపిక చేయడం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంపై బీజేపీ నేత సోము వీర్రాజు (Somu Veerraju) స్పందించారు.

Somu Veerraju: చాగంటి కోటేశ్వరరావు ఏ అవార్డుకైనా అర్హులే

విజయవాడ: ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao)ను గురజాడ పురస్కారానికి ఎంపిక చేయడం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంపై బీజేపీ నేత సోము వీర్రాజు (Somu Veerraju) స్పందించారు. అవార్డు ఎవరికి ఇవ్వాలనేది అందించే వ్యక్తులు, సంస్థల అభిప్రాయమన్నారు. తన దృష్టిలో చాగంటి కోటేశ్వరరావు ఏ అవార్డుకైనా అర్హులేనని తెలిపారు. చాగంటి అద్భుతమైన జ్ఞాన బాండాగారమని కొనియాడారు. రోడ్లపై ధర్నాలు చేస్తూ చాగంటి పేరు ఉచ్చరించే అర్హత ఎవరికీ లేదన్నారు. చాగంటి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగిస్తే సహించేది లేదని సోమువీర్రాజు హెచ్చరించారు. సంగీత, గాన, సాహిత్య, ఆధ్యాత్మిక తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఏటా ప్రదానం చేస్తున్న గురజాడ విశిష్ట పురస్కారానికి ఈ ఏడాది చాగంటి కోటేశ్వరరావును ఎంపిక చేశారు. చాగంటికి ఈ నెల 30న గురజాడ అప్పారావు వర్ధంతి రోజున పురస్కారం అందజేస్తామని తెలిపారు.

Updated Date - 2022-11-27T17:49:37+05:30 IST