కడపలో టీడీపీ శ్రేణులపై దాడి

ABN , First Publish Date - 2022-11-11T18:46:22+05:30 IST

Kadapa: కడపలోని వినాయకనగర్ సమీపంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ (YCP) వర్గీయులు టీడీపీ(TDP) వర్గీయులపై ఇనుప రాడ్లు, రాళ్ళతో దాడి చేశాయి.

కడపలో టీడీపీ శ్రేణులపై దాడి

Kadapa: కడపలోని వినాయకనగర్ సమీపంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ (YCP) వర్గీయులు టీడీపీ(TDP) వర్గీయులపై ఇనుప రాడ్లు, రాళ్ళతో దాడి చేశారు. గూడూరు పొలంలోని సర్వే నెంబర్ 229, 230‌లో నాలుగు సెంట్ల టీడీపీ కార్యకర్తకు చెంది‌న స్థలాన్ని.. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తమ్ముడు అహ్మద్ బాషా తన అనుచరులతో వచ్చి కబ్జా చేసేందుకు యత్నించారు. అయితే టీడీపీ శ్రేణులు వారిని అడ్డుకున్నారు. పోలీసుల సమక్షంలోనే వైసీపీ నాయకులు టీడీపీ నేతలపై రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని కడప రిమ్స్‌కు తరలించారు

Updated Date - 2022-11-11T18:55:12+05:30 IST

Read more