యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-10-07T05:17:56+05:30 IST

కుటుంబ కలహాలతో యువకు డు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం వెలుగు చూ సింది. అప్‌గ్రేడ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ శశికుమార్‌ తెలిపిన వివరాలి వి.

యువకుడి ఆత్మహత్య
మూర్తి (ఫైల్‌)

హిందూపురం, అక్టోబరు 6: కుటుంబ కలహాలతో యువకు డు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం వెలుగు చూ సింది. అప్‌గ్రేడ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ శశికుమార్‌ తెలిపిన వివరాలి వి. హిందూపురం మండలం జీవ్‌మాకులపల్లికి చెందిన రామక్రిష్టప్ప, రత్నమ్మల కుమారుడు నరసింహ మూర్తి అలియాస్‌ మూ ర్తి (25) బుధవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లా డు. ఎంతసేపటికి రాకపోవడంతో తండ్రి పొలంవద్దకు వెళ్లి రాత్రి 10గంటల సమయంలో చూసి వచ్చాడు. అప్పటికీ అక్కడ లేడు. అయితే గురువారం ఉదయం పొ లం వద్దకు వెళ్లగా, బోరు మోటారు ఉన్న రేకుల షెడ్డులో పైకప్పుకు ఉరేసుకున్నాడు.  సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ తెలిపారు. గత కొంతకాలంగా కు టుంబ కలహాలతో గొడవపడేవారని, ఈ నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. మృతునికి భార్య అరుణ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 


Read more