రాష్ట్రాన్ని డ్రగ్స్‌ ఆంధ్రగా మార్చిన వైసీపీ

ABN , First Publish Date - 2022-12-12T23:46:52+05:30 IST

రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్‌ విక్రయిస్తూ డ్రగ్స్‌ ఆంధ్రప్రదేశగా మార్చారని తెలుగు యువత నాయకులు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించా రు.

రాష్ట్రాన్ని డ్రగ్స్‌ ఆంధ్రగా మార్చిన వైసీపీ

పోలీసులకు తెలుగు యువత ఫిర్యాదు

హిందూపురం/చిలమత్తూరు, డిసెంబరు 12: రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్‌ విక్రయిస్తూ డ్రగ్స్‌ ఆంధ్రప్రదేశగా మార్చారని తెలుగు యువత నాయకులు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించా రు. సోమవారం తెలుగుయువత ఆధ్వర్యంలో హిందూపురం, చిల మత్తూరు పోలీస్‌స్టేషన్లలో వినతిపత్రాలు అందజేశారు. ఈసందర్భం గా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చా క గంజాయి, డ్రగ్స్‌, కల్తీకల్లు, నాటుసారా ఏరులై పారుతోందని ఆరో పించారు. అరికట్టాల్సిన ప్రభుత్వం ఈ వ్యాపారాల్లో భాగస్వాములు గా ఉండటంతో ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని దు య్యబట్టారు. యువత భవిష్యత్తు ప్రశ్నార్థకమైందన్నారు. హిందూపు రంలో తెలుగు యువత నాయకులు సర్పంచ మంజునాథ్‌, భార్గవ్‌, సూరి, సికిందర్‌, మూర్తి, యువతేజ, మారుతి, విష్ణు, చిలమత్తూరు లో తెలుగు యువత పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, సు రేంద్రయాదవ్‌, నరేష్‌, విజయ్‌కుమార్‌, మంజునాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T23:46:52+05:30 IST

Read more