సంక్షేమ పథకాలకు వైసీపీ తూట్లు: బీజేపీ
ABN , First Publish Date - 2022-06-27T05:26:05+05:30 IST
రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు విమ ర్శించారు.

గుంతకల్లుటౌన, జూన 26 : రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు విమ ర్శించారు. స్థానిక బీజేపీ కార్యాల యంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రా ష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ నా యకులు భూకబ్జాలకు పాల్పడు తున్నా రన్నారు. ఈ నెల 28న పట్టణంలో నిర్వ హించే బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశాలకు జాతీయ కార్యదర్శి సత్యకుమార్ హాజరవుతారన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిమి రామాంజినేయులు, పట్టణ అధ్యక్షుడు రాఘవేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శులు వాసం రవి, సతీష్ చౌదరి, ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి పాల్గొన్నారు.