సూసైడ్‌ నోట్‌ రాసి అదృశ్యం

ABN , First Publish Date - 2022-08-25T05:35:23+05:30 IST

నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డులో పెయింట్‌ షాప్‌ నిర్వహిస్తున్న శ్రీకాంత అనే వ్యక్తి సూసైడ్‌ నోట్‌ రాసి అదృశ్యమయ్యాడని రూరల్‌ సీఐ విజయభాస్కర్‌గౌడ్‌ తెలిపారు.

సూసైడ్‌ నోట్‌ రాసి అదృశ్యం

పెయింట్‌ వ్యాపారి కోసం పోలీసుల గాలింపు

  అనంతపురం క్రైం, ఆగస్టు 24: నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డులో పెయింట్‌ షాప్‌ నిర్వహిస్తున్న శ్రీకాంత అనే వ్యక్తి సూసైడ్‌ నోట్‌ రాసి అదృశ్యమయ్యాడని రూరల్‌ సీఐ విజయభాస్కర్‌గౌడ్‌ తెలిపారు. దుకాణం నుంచి బుధవారం ఉదయం బయటకు వెళ్లిన శ్రీకాంత.. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో అతని కోసం షాపులో ఉన్నవారు ఆరా తీశారు. సూసైడ్‌ లెటర్‌ కనిపించడంతో రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు. ‘నేను శ్రీకాంతను. సుబ్బారెడ్డి అన్నకు ఈ లేఖ అంకితం. మేము(శ్రీకాంత, రవి,అనిత) మీరు చెప్పిన మాటలు నమ్మి.. మీకు అంటే స్పైడర్‌ పెయింట్స్‌ అనే కంపెనీలో రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు మీరు డబ్బులు ఇన్వెస్ట్‌ చేసినవి ఇవ్వకుండా రోజుకో మాట మాట్లాడుతున్నారు. నన్ను ఇబ్బంది పెట్టినా పర్వాలేదు. రవి అన్నను ఇబ్బంది పెట్టకండి. మా ఇంట్లో డబ్బు పిచ్చివాళ్లున్నారు. నన్ను చిత్రహింసలు పెడుతున్నారు. వ్యాపారం లాభాల్లో లేదని మీరు (సుబ్బారెడ్డి) లాభం ఇవ్వరు. మాకు అన్యాయం చేయకండి. దైవ దర్శనాలు చేసుకునే కోరికలున్నాయి. అవి ముగించుకుని వెళ్తాను. నాగేంద్ర మామ మీరు చాలా గుర్తుకు వస్తారు. బాబాయి (చిదంబరం) ముద్ద చాలా బాగుంటుంది. సుబ్బరాయుడు మామ ఆరోగ్యం జాగ్రత్త. నాకు అమ్మానాన్న, అన్నల సపోర్ట్‌ లేదు. ఇంక నేను బతకడం వ్యర్థం అనుకొని వెళ్తున్నాను..’ అని సూసైడ్‌ లెటర్‌లో ఉంది. శ్రీకాంత కోసం అన్ని ప్రాంతాల్లో వెతకాలని సిబ్బందికి సీఐ ఆదేశాలిచ్చారు. 




Updated Date - 2022-08-25T05:35:23+05:30 IST