మహిళ దారుణహత్య
ABN , First Publish Date - 2022-12-07T00:02:32+05:30 IST
పట్టణంలోని మశానం పేటలో పద్మావతి(30) అనే మహిళను పొరుగింటికి చెందిన తండ్రీకొడుకులు బండరాయితో మోది హత్య చేశారు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది
బండరాళ్లతో దాడి చేసిన పొరుగింటి తండ్రి, కొడుకు
వాషింగ్ మిషన ఇంటిముందు పెట్టినందుకు వివాదం
కదిరి, డిసెంబరు 6: పట్టణంలోని మశానం పేటలో పద్మావతి(30) అనే మహిళను పొరుగింటికి చెందిన తండ్రీకొడుకులు బండరాయితో మోది హత్య చేశారు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పట్టణ సీఐ మధు తెలిపిన మేరకు, మశానం పేటలో డాన్స మాస్టర్ తేపల్లి మనోహర్, ఆయన భార్య పద్మావతి, ముగ్గురు కూతుళ్లతో ఉంటున్నారు. వీరి ఇంటి పక్కనే వేమానాయక్, ఆయన కుమారుడు ప్రకాష్ నాయక్ ఉంటున్నారు. వేమనాయక్ ఇంటికి వెళ్లేందుకు మనోహర్ ఇళ్లు దాటాల్సి ఉంటుంది. ఈ దారిలో పద్మావతి తరచూ వాషింగ్ మిషన పెట్టి బట్టలు ఉతికేవారు. ఈ కారణంగా రెండు కుటుంబాల మధ్య పలుమారు గొడవలు జరిగాయి. ఈ క్రమం లో మంగళవారం ఉదయం మనోహర్ తన పెద్ద కూతురుతో కలిసి ఉదమే డాన్స క్లాస్‌కు వెళ్లాడు. ఆ తరువాత పద్మావతి బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన బయట పెట్టింది. దీంతో ఆగ్రహించిన వేమనాయక్, ప్రకా్‌షనాయకు ఆమెతో గొడవపడ్డారు. వివాదం ముదిరి.. ఆమెపై తండ్రీకొడుకులు బండరాయితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన పద్మావతి రక్తపుమడుగులో పడి కొట్టుకుంటుండగా, ఆమె చిన్న కూతుళ్లు తండ్రికి ఫోన చేసి ‘అమ్మను కొడుతున్నారు..’ అని సమాచారం ఇచ్చారు. దీంతో మనోహర్ వెంటనే ఆయన ఇంటికి వచ్చి, భార్యను కదిరి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథ మ చికిత్స అనంతరం బెంగుళురు తరలిస్తుండగా ఆమె మృతిచెందారు. దీంతో మృతదేహాన్ని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. పద్మావతి తలకు, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. మనోహర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా, పద్మావతిపై బండరాయితో మోదడంతోపాటు కొడవలితో దాడి చేశారని, ఆ తరువాత ఇంటికి తాళం వేసి పరారయ్యారని స్థానికులు తెలిపారు.
పాపం పసిపిల్లలు
కన్నతల్లిపై పొరుగింటివారు విచక్షణారహితంగా దాడి చేస్తున్న సమయంలో ఇద్దరు పసిపిల్లలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొన్నారు. నిండా ఐదేళ్లు కూడా లేని చిన్నారులు తల్లి మొబైల్ ఫోన నుంచి తండ్రికి ఫోన చేశారు. ‘నాన్నా.. అమ్మను కొడుతున్నారు..’ అని భయం భయంగా చెప్పారు. తండ్రి వచ్చేవరకూ రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూస్తూ భీతిల్లిపోయారు. పద్మావతి హత్యతో ఆమె ముగ్గురు కూతుళ్లు ఆస్పత్రిలో బోరున విలపించారు. వారి పరిస్థితిని చూసి చుట్టుపక్కల వారు కంటతడిపెట్టారు.