ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి

ABN , First Publish Date - 2022-09-11T05:09:44+05:30 IST

మండలంలోని చౌళూరుకు చెందిన మహదేవమ్మ(43) శనివారం ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతిచెందింది. అప్‌గ్రేడ్‌ ఎస్‌ఐ కరీం తెలిపిన వివరాలివి.

ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి
మృతురాలు మహదేవమ్మ

హిందూపురం, సెప్టెంబరు 10: మండలంలోని చౌళూరుకు చెందిన మహదేవమ్మ(43) శనివారం ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతిచెందింది. అప్‌గ్రేడ్‌ ఎస్‌ఐ కరీం తెలిపిన వివరాలివి. మహదేవమ్మ పొలానికి వెళ్లి తిరిగి వస్తూ చెరువులో కాళ్లు కడుక్కోవడానికి వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులోపడి మృతి చెందింది. మృతురాలికి భర్త లింగప్ప, కుమారుడు, కుమార్తె ఉన్నారన్నారు. మృతదేహాన్ని వెలికితీసి శవపంచనామా నిమిత్తం హిందూపురం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


Read more