భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-08-19T04:44:09+05:30 IST
మండలంలోని నల్లూరు గ్రా మానికి చెందిన నరసింహప్ప(39) భార్య కాపురానికి రాలేదని గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రొద్దం, ఆగస్టు 18: మండలంలోని నల్లూరు గ్రా మానికి చెందిన నరసింహప్ప(39) భార్య కాపురానికి రాలేదని గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. నరసింహప్ప భార్య పు ట్టింటికి వెళ్లి కాపురానికి రాలేదు. దీంతో మనస్తాపం చెంది ఇంటి సమీపంలోని చెట్లుకు ఉరేసుకున్నాడు. మృతుడు పంచాయతీ కార్యాలయంలో స్వీపర్‌గా ప నిచేస్తుండేవాడు. ఎస్ఐ నాగస్వామి సంఘటనా స్థ లాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం ని మిత్తం పెనుకొండ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.