AP News: గోరంట్ల వీడియోను నేషనల్ ఫోరెన్సిన్ డిపార్ట్మెంట్కు ఎందుకు పంపరు? : వంగలపూడి అనిత
ABN , First Publish Date - 2022-08-19T01:03:16+05:30 IST
విశాఖపట్నం: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Hindupur MP Gorantla Madhav) న్యూడ్ వీడియోపై దుమారం ఇంకా రాజుకుంటూనే ఉంది. ఎంపీ గోరంట్లను కాపాడేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తుందని టీడీపీ నేత వంగలపూడి అనిత (Vangalapudi

విశాఖపట్నం: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Hindupur MP Gorantla Madhav) న్యూడ్ వీడియోపై దుమారం ఇంకా రాజుకుంటూనే ఉంది. ఎంపీ గోరంట్లను కాపాడేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తుందని టీడీపీ నేత వంగలపూడి అనిత (Vangalapudi Anita) ఆరోపిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల నోట అబద్దాలు పలికిస్తూ.. పోలీసు వ్యవస్థను అప్రతిష్ఠ పాలు చేస్తున్నారని విమర్శించారు. గోరంట్ల వీడియోలో ఎలాంటి ఎడిటింగ్ జరగలేదని ఇచ్చిన ల్యాబ్ రిపోర్టు పరిగణనలోకి తీసుకోలేమని చెబుతున్నపుడు.. ఆ వీడియోను ఎందుకు నేషనల్ ఫోరెన్సిన్ డిపార్ట్మెంట్కు పంపడం లేదని ప్రశ్నించారు. ఇప్పటివరకు మాధవ్ ఫోన్ ఎందుకు సీజ్ చేయలేదని, అసలు గోరంట్ల వ్యవహారంపై ముఖ్యమంత్రి (CM Jagan) హోంమంత్రి ఎందుకు మాట్లాడటం లేదని ఫైర్ అయ్యారు.