బదిలీ అయినా.. మస్టర్లలో సంతకాలు

ABN , First Publish Date - 2022-07-05T05:18:24+05:30 IST

మండలంలో ఉపాధి పథకంలో చేపట్టిన పలు పనుల పర్యవేక్షణ లేకపోయినా... బదిలీ అయిన ఎంపీడీఓ విష్ణుప్రసాద్‌ సోమవారం సంతకాలు పెట్టారు.

బదిలీ అయినా.. మస్టర్లలో సంతకాలు
సంతకాల కోసం వేచి ఉన్న ఫీల్డు అసిస్టెంట్లు
గాండ్లపెంట, జూలై 4: మండలంలో ఉపాధి పథకంలో చేపట్టిన పలు పనుల పర్యవేక్షణ లేకపోయినా... బదిలీ అయిన ఎంపీడీఓ విష్ణుప్రసాద్‌ సోమవారం సంతకాలు పెట్టారు. గత ఏప్రిల్‌ నుంచి ఉపాధి పథకంలో చేపట్టిన కందకాలు, చెరువు, నీటివంకల పూడికతీత తదితర పనులకు మస్టర్లలో సంతకాలను  ఆయన ఎంపీడీఓ కార్యాలయంలో పెట్టారు. ఎంపీడీఓ పులివెందులకు బదిలీ అయ్యారు. అయితే త్వరలో ఉపాఽధి పనులపై కేంద్రబృందం పరిశీలనకు రానుంది. గతంలో ఎలాంటి పర్యవేక్షణ లేకుండా వాటి బిల్లులు కూడా అందించారన్న విమర్శలున్నాయి. మస్టర్లలో సంతకాల కోసం మండలంలో పనిచేస్తున్న ఫీల్డు అసిస్టెంట్లు అందరూ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆయనను చుట్టుముట్టి సంతకాలు చేయించుకోవడం గమనార్హం. ఈవిషయంపై ఎంపీడీఓ విష్ణు ప్రసాద్‌ను వివరణ కోరగా... ఈ పనులన్నీ పర్యవేక్షించామని, తప్పిపోయిన వాటికి సంతకాలు చేస్తున్నట్లు చెప్పారు.

Updated Date - 2022-07-05T05:18:24+05:30 IST