టూరిజం రెస్టారెంట్‌ తెరచుకునేదెన్నడు?

ABN , First Publish Date - 2022-06-12T05:39:46+05:30 IST

మండలంలోని కొడికొండ చెక్‌పోస్టు లో 44వ జాతీయ రహదారి పక్కనే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉన్న ఏపీ టూరిజం రెస్టారెంట్‌ ఐదేళ్లుగా మూతపడింది.

టూరిజం రెస్టారెంట్‌ తెరచుకునేదెన్నడు?
కొడికొండ చెక్‌పోస్టులోని ఏపీ టూరిజం రెస్టారెంట్‌

చిలమత్తూరు, జూన 11: మండలంలోని కొడికొండ చెక్‌పోస్టు లో 44వ జాతీయ రహదారి పక్కనే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉన్న ఏపీ టూరిజం రెస్టారెంట్‌ ఐదేళ్లుగా మూతపడింది. రీఓపెన టెండర్లతోనే సరిపెట్టుకుపోతున్నారు. ఐదేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎంతో సౌకర్యంగా ఉన్న ఈ రెస్టారెంట్‌ ఇప్పుడు శిథిలావస్థకు చేరకుంటోంది. 2005లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యార్థం రూ.60 లక్షల వ్యయంతో ఎంతో సుందరంగా రెస్టారెంట్‌ని నిర్మించారు. అప్పటి నుంచి 2012 వరకు ఆదాయానికి ఆదాయం... ప్రయాణికులకు శుచి శుభ్రతతో కూడిన ఆ హారం అందింది. అయితే 2013లో రెస్టారెంట్‌కి ఆదాయం తగ్గింద ని, నిర్వహణకు ఇబ్బందిగా మారిందంటూ ప్రభుత్వం ప్రైవేటు వారికి రెస్టారెంట్‌ నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. దాంతో కొందరు ప్రైవేటు వారు 2017 వరకు రెస్టారెంట్‌ని నిర్వహించారు. అనంతరం వారికి ప్రభుత్వం ఇచ్చిన లీజ్‌ ముగియడంతో అప్పటి నుంచి రెస్టారెంట్‌ మూతపడింది. 


పలు దఫాలుగా రెస్టారెంట్‌ నిర్వహణకు ప్రభుత్వం టెండర్లను అహ్వానించింది. అప్పట్లో కొందరు టెండర్లును దక్కించుకున్నా రెస్టారెంట్‌ నిర్వహణకు ముం దుకు రాలేదని సమాచారం. దాంతో నవంబరు 5వ తేదీ 2021న  మరోసారి టెండర్లకు నోటిఫికేషన ఇచ్చి టెండర్లను అదేనెల 25న బిడ్‌లను ఓపెన చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతవరకు ఓపెన చేసింది లేదు... రెస్టారెంట్‌ తెరచింది లేదు. టెండర్లు తీసుకొని ఏడాదిపైనే కావస్తున్నా వాటిని  ఓపెన చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుండటంతో రెస్టారెంట్‌ భవనం రోజురోజుకు శిథిలావస్థకు చేరుకుంటోంది. 


కొడికొండకు ఐకాన

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొడికొండ చెక్‌పోస్టులోని టూరిజం రెస్టారెంట్‌ ఈ ప్రాంతానికి ఐకానగా గుర్తింపు పొందింది. ప్రధానంగా 44వ జాతీయ రహదారిలో ఉండటం, కర్ణాటక సరిహద్దులో ఉంటూ రెండు రాష్ర్టాల ప్రయాణికులకు ఎంతో సౌకర్యం గా ఉండటంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో పాటు కొడికొండ చెక్‌పోస్టు పరిధిలో లేపాక్షి, పుట్టపర్తి, కదిరి, వీరాపురం, ఇటు అనంతపురం, అటు బెంగళూరు నగరం ఉండటంతో నిత్యం ప్ర యాణికులతో కిటకిటలాడేది. అయితే అప్పట్లో అధికారులు చేసిన తప్పిదాలతో రెస్టారెంట్‌ పూర్తిగా మూతపడేందుకు కారణమైంది. 


శిథిలావస్థలో భవనం 

లక్షల రూపాయల వ్యవయంతో నిర్మించిన భవనం ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా శిథిలావస్థకు చేరుకుంటోంది. వరుసగా ఐదేళ్లు గా మూతపడటం, దానిని పట్టించుకునేవారు లేకపోవడంతో ఇప్పటికే శిథిలావస్థకు చేరుకుంది. భవనంలో దొంగలు పడి తలుపులు, కిటకీలు ఇలా ఏవి పడితే వాటిని తరలించేశారు. ఎంతో ఆహ్లాదకరమైన పిల్లల ఆటస్థలం, పచ్చని చెట్లు అన్ని నేలకూలాయి. అటు గా రోడ్డున వెళ్లే వారికి అందంగా కనపడిన ఒకప్పటి ఏపీ టూ రిజం రెస్టారంట్‌ భవనం... ఇప్పుడు శిథిలమవుతోంది. ప్రభుత్వ కా లయాపన చేయడం వలన లక్షల రూపాయల విలువచేసే భవ నం శిథిలమవడంతో పాటు ప్రయాణికులకు శుచి శుభ్రతతో కూడి న భోజనాన్ని అందివ్వలేకపోతున్నారనడంలో అతిశయోక్తి లేదు. 


త్వరలో బిడ్లు ఓపెన చేస్తాం..

 నాగేశ్వరరెడ్డి, పర్యాటక శాఖ జిల్లా ఇనచార్జి అధికారి

త్వరలోనే ఏపీ టూరిజం రెస్టారెంట్‌ నిర్వహణకు వేసిన టెండ ర్లు ఓపెన చేస్తాం. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. బిడ్‌ ఓపెన కా గానే వెంటనే కొడికొండ చెక్‌పోస్టులోని టూరిజం రెస్టారెంట్‌  పునఃప్రారంభమవుతుంది. ప్రయాణికులకు సౌకర్యంగా తీర్చిదిద్ది రెస్టారెంట్‌కి పూర్వవైభవాన్ని తీసుకువస్తాం.   


Read more