చిత్తడి రోడ్లు.. ప్రయాణానికి పాట్లు
ABN , First Publish Date - 2022-05-24T06:24:19+05:30 IST
మండలంలోని పలు గ్రామాల రోడ్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అధ్వానంగా మారాయి. రోడ్ల గుంతల్లో వర్షపు నీరు చేరి మడుగులను తలపిస్తున్నాయి.

మడకశిర రూరల్, మే 23: మండలంలోని పలు గ్రామాల రోడ్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అధ్వానంగా మారాయి. రోడ్ల గుంతల్లో వర్షపు నీరు చేరి మడుగులను తలపిస్తున్నాయి. మరికొన్ని రోడ్డు బురద చేరి అడుగు వేయలేని పరిస్థితి నెలకుం ది. నల్లనాయనపల్లి, కేతేపల్లి, యల్లోటి, ఉప్పిడిపల్లి, భక్తరహళ్ళి,వైబీ హళ్ళి, గుద్దిలపల్లి, గంతలపల్లి, కంఠీపురం, రేకులకుంట, ది గువ రామగిరి, రంగాపురం, సీ కొడిగేపల్లి, జాడ్రపల్లి తదితర గ్రా మాల రహదారులు వర్షాలకు భారీగా దెబ్బతిన్నాయి. ఈ రోడ్లపై ప్రయాణికులు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాడ్రపల్లి రహదారి బురదమయం కావడంతో ఈ రహదారిలో గ్రామస్థులు వెళ్లడం లేదు. మరోగ్రామానికి వెళ్లి చుట్టుతిరిగి స్వగ్రామానికి చేరుకుంటున్నారు.
బుళ్ళసముద్రం నుంచి కంఠీపురం మార్గం గుంతలమయమై నీరు చేరాయి. దీంతో గ్రామస్థులు రైతు పొలా ల గుండా వెళుతున్నారు. రేకులకుంట గ్రామం మధ్యన నీరంత రోడ్డుపై నిలబడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి గ్రామాల రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.