మేమే బాగుచేస్తాం
ABN , First Publish Date - 2022-12-15T00:44:41+05:30 IST
నగరంలో గుంతలమయమైన రోడ్లను బాగుచేసే పనిని జనసేన నాయకులు బుధవారం చేపట్టారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య ఆధ్వర్యంలో సప్తగిరి సర్కిల్‌లో ఉన్న గుంతలను కంకర మట్టితో పూడ్చారు. పాతూరు పవర్ ఆఫీస్ వద్ద రోడ్లపై గుంతలను పూడ్చారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడున్నర సంవత్సరాలు అవుతోందని, ఇప్పటికీ రహదారులపై గుంతలు పూడ్చలేని స్థితిలో ఉండటం సిగ్గుచేటని అంకె ఈశ్వరయ్య అన్నారు.
నగరంలో రోడ్లకు జనసేన మరమ్మతు
అనంతపురం ప్రెస్‌క్లబ్, డిసెంబరు 14: నగరంలో గుంతలమయమైన రోడ్లను బాగుచేసే పనిని జనసేన నాయకులు బుధవారం చేపట్టారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య ఆధ్వర్యంలో సప్తగిరి సర్కిల్‌లో ఉన్న గుంతలను కంకర మట్టితో పూడ్చారు. పాతూరు పవర్ ఆఫీస్ వద్ద రోడ్లపై గుంతలను పూడ్చారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడున్నర సంవత్సరాలు అవుతోందని, ఇప్పటికీ రహదారులపై గుంతలు పూడ్చలేని స్థితిలో ఉండటం సిగ్గుచేటని అంకె ఈశ్వరయ్య అన్నారు. నగరంలో మేయర్, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు ఉండి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న పవన కల్యాణ్ ఆశయంతోనే రోడ్లను బాగుచేస్తున్నామని అన్నారు. ఒక్క ఫోన కాల్‌తో శిథిలమైన రహదారులను శ్రమదానంతో బాగుపరుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, నగర ఉపాధ్యక్షులు గ్రంథి దివాకర్, జక్కిరెడ్డి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.