ఎమ్మెల్సీల ఓటరు జాబితా విడుదల

ABN , First Publish Date - 2022-12-31T00:34:11+05:30 IST

అనంతపురం, కర్నూలు, కడప పశ్చిమ రాయలసీమ పట్టుభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తుది ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్‌ శుక్రవారం విడుదల చేశారు.

ఎమ్మెల్సీల ఓటరు జాబితా విడుదల
ఎమ్మెల్సీ ఓటరు జాబితాను విడుదల చేస్తున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

పట్టుభద్రులు 3,28,807... ఉపాధ్యాయులు 27,716

ప్రకటించిన కలెక్టర్‌ నాగలక్ష్మి

అనంతపురం టౌన, డిసెంబరు30: అనంతపురం, కర్నూలు, కడప పశ్చిమ రాయలసీమ పట్టుభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తుది ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్‌ శుక్రవారం విడుదల చేశారు. పట్టభద్రులు 3,28,807 ఉన్నారు. ఇందులో పురు షులు 2,21,558 ఉండగా మహిళా ఓటర్లు 1,07,216 మంది ఉన్నారు. ఉపాఽధ్యాయ ఓటర్లు 27,716 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 17,023 మంది ఉండగా, మహిళా ఉపాధ్యాయుల ఓట్లు 10689 మంది ఉన్నాయి. ఇందులో కడప జిల్లా నుంచే అత్యధికంగా ఓట్లు నమోదయ్యాయి. పట్టభద్రులలో అత్యధికంగా 81187 నమోదు కాగా, ఉపాధ్యాయ ఓటర్లలో 7358 నమోదై ప్రథమ స్థానంలో ఆ జిల్లా నిలిచింది. గత నెలలో విడుదల చేసిన జాబితాలో ఉపాధ్యాయ ఓటర్లలో దాదాపు నాలుగువేలకు పైగానే తగ్గిపోయాయి. పట్టభద్రుల్లో కూడా 5వేల వరకు తగ్గాయి. అధికార పార్టీ బోగస్‌ ఓట్లను నమోదు చేయించిందని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర, కేంద్ర, ఎన్నికల కమిషనలకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీంతో కొంత మేరా జాబితా పరిశీలించి తగ్గించారు. కానీ ఇప్పటికీ అధికార పార్టీ నమోదు చేయించిన బోగస్‌ ఓట్లు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Updated Date - 2022-12-31T00:34:12+05:30 IST