గ్రామాలు.. మురుగునీటి కూపాలు

ABN , First Publish Date - 2022-12-31T00:37:06+05:30 IST

వైసీపీ పాలనలో గ్రామాలు మురుగునీటి కూపాలుగా మారాయని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమామహేశ్వరనాయుడు విమర్శించారు

గ్రామాలు.. మురుగునీటి కూపాలు
నాగిరెడ్డిపల్లి బీసీ కాలనీలో మురుగునీటి గుంత వద్ద నిరసన చేపట్టిన ఉమా, గ్రామస్థులు, నాయకులు

వైసీపీ పాలనపై ఉమా ఆగ్రహం

బ్రహ్మసముద్రం, డిసెంబరు 30: వైసీపీ పాలనలో గ్రామాలు మురుగునీటి కూపాలుగా మారాయని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమామహేశ్వరనాయుడు విమర్శించారు. మండలంలోని నాగిరెడ్డిపల్లి, భైరసముద్రంలో పార్టీ మండల కన్వీనర్‌ పాలబండ్ల శ్రీరాములు ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని చేపట్టారు. నాగిరెడ్డిపల్లి బీసీ కాలనీలో నిలిచిన మురుగునీటి వద్ద ఇదేం ఖర్మ స్టిక్కర్లు, పోస్టర్లతో నిరసన తెలిపారు. గ్రామాలలో అపరిశుభ్రత నెలకొన్నా పాలకులకు పట్టడం లేదని విమర్శించారు. గ్రామాల్లో రచ్చకట్ట వద్ద సమావేశాలు నిర్వహించి, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన దొడగట్ట నారాయణ, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి కురుగౌడ, మండల ప్రఽధాన కార్యదర్శి భీమన్న, క్లస్టర్‌ ఇనచార్జ్‌ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:37:07+05:30 IST