ఇసుక టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్థులు

ABN , First Publish Date - 2022-10-04T05:17:55+05:30 IST

మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో ఇసుక టిప్పర్లను సోమవారం గ్రామస్థులు అడ్డుకున్నారు.

ఇసుక టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్థులు
గ్రామస్థులు అడ్డుకుని నిలబెట్టిన ఇసుక టిప్పర్లు


ముదిగుబ్బ, అక్టోబరు 3: మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో ఇసుక టిప్పర్లను సోమవారం గ్రామస్థులు అడ్డుకున్నారు. స్థానిక ఇసుక రీచ నుంచి ఇసుకను తరలిస్తున్న టిప్పర్లు అధికంగా గ్రామంలో వెళ్తుండటంతో రోడ్లన్నీ అధ్వాన్న స్థితికి చేరాయన్నారు. కనీసం ద్విచక్రవాహనాలు, ఆటోల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని గ్రామస్థులు మండిపడ్డారు. గ్రామంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేసి ఆ తరువాత ఇసుకను తరలించుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పడంతో గ్రామస్థులు వెనుతిరిగిపోయారు. టిప్పర్లను కూడా పోలీసులు అక్కడి నుంచి పంపించారు.


Read more