వైభవంగా ఉరుసు ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-12-15T00:04:00+05:30 IST

మండలంలోని దర్గా హోన్నూరు గ్రామంలో వెలసిన సయ్యద్‌ సర్మస్‌ వలీ చిఫ్తీ ఉరుసు ఉత్సవాలు బుధవా రం అంగరంగ వైభవంగా ముగిశాయి.

వైభవంగా ఉరుసు ఉత్సవాలు

బొమ్మనహాళ్‌, డిసెంబరు 14: మండలంలోని దర్గా హోన్నూరు గ్రామంలో వెలసిన సయ్యద్‌ సర్మస్‌ వలీ చిఫ్తీ ఉరుసు ఉత్సవాలు బుధవా రం అంగరంగ వైభవంగా ముగిశాయి. బుధవారం వేకువజామున స్వామి వారి గుర్రం సవారీగా భారీ భక్తజన సందోహం మధ్య సవారీగా వచ్చింది. దర్గాహోన్నూరు పంచాయతీ పరిధిలోని వన్నళ్లి గ్రామం నుంచి స్వామివారి గుర్రం ఊరేగింపుగా దర్గాలోకి వచ్చింది. దర్గా ముతవల్లీ సయ్యద్‌ రహిం తుల్లా చిప్తీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి స్వామి వారి గుర్రానికి పూజలు నిర్వహించారు. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు దర్గాలో ప్రార్థనలు నిర్వహించి కందూరి నిర్వహించి మొక్కులు చెల్లించారు.

Updated Date - 2022-12-15T00:04:03+05:30 IST