వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-13T05:30:00+05:30 IST

పెనుకొండ పట్టణం, మండలంలో శనివారం ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పో లీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి.

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
మృతురాలు అనితబాయి

పెనుకొండ రూరల్‌/పెనుకొండ, ఆగస్టు 13: పెనుకొండ పట్టణం, మండలంలో శనివారం ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పో లీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. మండలం లోని కొండంపల్లికి చెందిన రమే్‌షబాబు నాయక్‌కు 15 ఏళ్ల క్రితం పెనుకొండ సమీపంలోని వెంకటాపు రం తండాకు చెందిన అనితబాయితో వివాహమైం ది. బేల్దార్‌ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఇటీవల ఆర్థిక ఇ బ్బందులు తలెత్తాయి. ప్రైవేట్‌ వ్యక్తుల ద్వారా రూ.5 లక్షలకుపైగా అప్పు చేశారు. వారి ఒత్తిళ్లు భరించలేక మనస్తాపం చెందిన లలిత బాయి ఇం ట్లో దూలానికి చీరతో ఉరేసుకుంది. బంధువులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృ తురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్న ట్లు తెలిపారు. అదేవిధంగా పెనుకొండ పట్టణంలోని కుమ్మరదొడ్డి వీధిలో కాపురం ఉంటున్న దాదాపీర్‌(45) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్లాస్టిక్‌ బిందెల వ్యాపారం చేస్తుండేవాడు. వ్యాపారం సక్రమం గా నడవకపోవడంతోపాటు కుమార్తె చదువులు, పెళ్లికి డబ్బులు ఎలా సంపాదించాలో తెలియక మనస్తాపం చెందాడు. ట్యాక్సీ స్టాండ్‌ వద్ద ఉ రేసుకున్నట్లు ఎస్‌ఐ రమే్‌షబాబు తెలిపారు. మృతునికి భార్య, కుమారు డు, కుమార్తె ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2022-08-13T05:30:00+05:30 IST