నకిలీ బంగారం కేసులో ఇద్దరి అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-12-15T00:19:42+05:30 IST

నకిలీ బంగారాన్ని విక్రయించిన కేసులో కడపజిల్లా షికారీపాళెం గ్రామానికి చెందిన అన్నదమ్ములు పోమర్‌ చంద్రునాయక్‌, పోమర్‌ ఉమర్‌నాయక్‌లను అరె్‌స్టచేసి వారి వద్ద నుంచి రూ.11.10లక్షల నగదు, ద్విచక్రవాహనాన్ని స్వాధీన పరుచుకున్నట్లు పెనుకొండ డీఎస్పీ హుస్సేనపీరా తెలిపారు

నకిలీ బంగారం కేసులో ఇద్దరి అరెస్ట్‌
పట్టుబడిన నగదుతో డీఎస్పీ హుస్సేనపీరా,

రూ.11.10 లక్షల నగదు, ద్విచక్రవాహనం స్వాధీనం

గోరంట్ల, డిసెంబరు 14: నకిలీ బంగారాన్ని విక్రయించిన కేసులో కడపజిల్లా షికారీపాళెం గ్రామానికి చెందిన అన్నదమ్ములు పోమర్‌ చంద్రునాయక్‌, పోమర్‌ ఉమర్‌నాయక్‌లను అరె్‌స్టచేసి వారి వద్ద నుంచి రూ.11.10లక్షల నగదు, ద్విచక్రవాహనాన్ని స్వాధీన పరుచుకున్నట్లు పెనుకొండ డీఎస్పీ హుస్సేనపీరా తెలిపారు. గోరంట్ల పోలీస్‌ స్టేషనలో బుధవారం రాత్రి 7గంటలకు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం శ్రీరామ్‌నగర్‌ పెద్దపేట గ్రామాలకు చెందిన రవి, ప్రవీణ్‌లకు డిసెంబర్‌ 10న నిందితులిద్దరు నిధి దొరికిందని బంగారాన్ని తక్కువ ధరకు విక్రయిస్తామని ఆశ చూపి మోసం చేశారు. మొదటి మంచి బంగారాన్ని ఇచ్చి నమ్మించి తరువాత పథకం ప్రకారం మోసానికి పాల్పడ్డారు. గోరంట్ల మండలం 44వ జాతీయ రహదారిపై పాలసముద్రం క్రాస్‌వద్ద 3కిలోల బం గారు పూసల చైను నకిలీ గొలుసును ఇచ్చి వారి వద్ద నుంచి రూ.15లక్షల నగదును తీసుకుని పారిపోయారు. తరువాత మోసపోయిన విషయాన్ని గుర్తించి బాదితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఆదేశాల మేరకు గోరంట్ల సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎస్‌ఐబాబు, పోలీస్‌ సిబ్బంది గోరంట్ల మండలం కాటేపల్లి క్రాస్‌వద్ద చంద్రునాయక్‌, ఉమర్‌నాయక్‌లను బుధవా రం మధ్యాహ్నం అరెస్ట్‌ చేశారు. రూ.11.10లక్షల నగదు, ద్విచక్రవాహనాన్ని స్వాదీన పరుచుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2022-12-15T00:19:43+05:30 IST