తూతూ మంత్రంగా సర్వసభ్య సమావేశం
ABN , First Publish Date - 2022-06-28T06:33:19+05:30 IST
స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ గిరక రమాదేవి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం తూతూమంత్రంలా సాగింది.

గంటలోపే ముగింపు
గైర్హాజరైన పలువురు
సభ్యులు, అధికారులు
ఖాళీగా దర్శన మిచ్చిన కుర్చీలు
ధర్మవరం రూరల్, జూన 27: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ గిరక రమాదేవి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం తూతూమంత్రంలా సాగింది. గంటలోపే ముగించారు. మధ్యాహ్నం 2.30గంటలకు నిర్వహించాల్సిన సమావేశం 3.15గంటలకు నిర్వహించగా 4గంటలకు ముగిసింది. ముందుగా ఆయా శాఖల అధికారులు నివేదికలను వివరించారు. అనంతరం ఉప్పునేసినపల్లి సర్పంచ ముత్యాలప్పనాయుడు తమ ఊరికి బస్సు రాదని, చిగిచెర్ల మీదుగా వెళ్లే బస్సు గ్రామస్తులు సౌకర్యార్థం ఉప్పునేసినపల్లి మీదుగా ఆర్టీసీబస్సు నడపాలని, వేరుశనగ సబ్సిడీ విత్తనాలు రెండోవిడత పంపిణీ చేయాలని కోరారు. బీమా రైతులందరికీ సరిగా అందలేదని తెలిపారు. చింతలపల్లి సర్పంచ నాగానందరెడ్డి తదితరులు తమ గ్రామాల్లో సభ దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ క్రిష్ణారెడ్డి, ఎంపీడీఓ విజయ్‌భాస్కర్, ఈఓఆర్డీ శంకర్‌రెడ్డి, ఏఓ చన్నవీరస్వామి, డీటీ అనిల్‌కుమార్, ఏపీఓ అనిల్‌కుమార్‌రెడ్డి, హార్టికల్చర్ అధికారణి అమరేశ్వరి, ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు.
గైర్హాజరైన సర్పంచలు, ఎంపీటీసీలు, అధికారులు
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్వసభ్య సమావేశంలో సమస్యలను లెవనెత్తి పరిష్కారించు కోవాల్సిన భాద్యత ప్రజాప్రతినిధులపై ఉంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ సర్వసభ్య సమావేశానికి పలువురు సర్పంచలు, ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. దీంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శినమిచ్చాయి. ప్రజాసమస్యలపై చర్చించేందుకు కూడా సమావేశా లకు రాకపోవడం ఏమిటోనని హాజరైన తోటి ప్రజాప్రతినిధులు, అధికారు లు చర్చించుకున్నారు.
అదేవిధంగా పశువైద్యం, హౌసింగ్, సాంఘిక సంక్షేమం, ఎక్సైజ్, పోలీసు తదితర పలు శాఖల అధికారులు సమావేశానికి హాజరుకాలేదు. హాజరు కాని అధికారులపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఎంపీడీఓ విజయ్‌భాస్కర్ తెలిపారు.