అమరజీవికి ఘన నివాళి
ABN , First Publish Date - 2022-12-16T00:07:07+05:30 IST
రాష్ట్ర అవతరణ కోసం గాంధేయ మార్గంలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు భావి తరాలకు ఆదర్శమని కలెక్టర్ నాగలక్ష్మి కొనియాడారు.
అనంతపురం టౌన, డిసెంబరు 15: రాష్ట్ర అవతరణ కోసం గాంధేయ మార్గంలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు భావి తరాలకు ఆదర్శమని కలెక్టర్ నాగలక్ష్మి కొనియాడారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంత కుమార్, పలువురు అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ప్రత్యేక రాష్ట్రంతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి, తెలుగువారి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఈ సందర్భంగా కలెక్టర్ కొనియాడారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి ఖుష్బూ కొఠారి, బీసీ కార్పొరేషన ఈడీ నాగమణి, నాగరత్నమ్మ, మారుతి తదితరులు పాల్గొన్నారు.