సినీనటుడు సూపర్‌స్టార్‌ కృష్ణకు ఘననివాళి

ABN , First Publish Date - 2022-11-16T00:00:06+05:30 IST

సినీనటుడు సూపర్‌స్టార్‌ కృష్ణ కు ఆయన అభిమానులు ఘననివాళులు అర్పించారు. మంగళవారం కృష్ణ మృతి చెందాడన్న విషయం తెలుసుకుని విషాదంలో మునిగి పోయారు.

సినీనటుడు సూపర్‌స్టార్‌ కృష్ణకు ఘననివాళి

హిందూపురం, నవంబరు 15: సినీనటుడు సూపర్‌స్టార్‌ కృష్ణ కు ఆయన అభిమానులు ఘననివాళులు అర్పించారు. మంగళవారం కృష్ణ మృతి చెందాడన్న విషయం తెలుసుకుని విషాదంలో మునిగి పోయారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద చిత్రపటానికి పూలమాలలువే శారు. ఈసందర్భంగా అభిమానులు మాట్లాడుతూ కృష్ణ సినీ పరిశ్రమలో ఓ ధృవతారలాంటివాడని, ఆయన నటించిన సినిమాలు స మాజహితం కోసమేని కొనియాడారు. ఆయన లేరన్న లోటు అభిమానులకు జీర్ణించుకోలేనిదన్నారు. ఆయన ఆత్మకుశాంతి చేకూరాల ని, వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో క్రిష్ణ అభిమాన సంఘం నాయకులు కొండూరు మల్లికార్జున, దాదు, కిరోసినబాబు, రమణ, శేఖర్‌, షాకీర్‌, కుమార్‌, కళాకారుల ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు.

పావగడ: పట్టణంలోని శనేశ్వరస్వామి సర్కిల్‌లో మంగళవారం తెలుగు చలనచిత్ర నటుడు సూపర్‌స్టార్‌ కృష్ణ మరణంతో అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. ఉదయం కృష్ణ మరణ వార్త వినగానే తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. కృష్ణ అభిమాన సంఘం అ ధ్యక్షులు అశ్వర్థప్ప మాట్లాడుతూ అంచెలంచెలుగా ఎదిగిన కృష్ణ తె లుగు చలన చిత్రాలకు రంగులు దిద్దిన ఘనుడన్నారు. 300 చిత్రాలకు పైగా నటించిన సూపర్‌స్టార్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా ఎదిగారని అన్నారు. నటనతో అఖిలాంధ్ర ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకొన్నారని తెలిపారు. కార్యక్రమంలో శాంతిమెడికల్‌ దేవరాజు, మానం శశికిరణ్‌, అభిమానులు పాల్గొన్నారు.

పెనుకొండ: సూపర్‌స్టార్‌ క్రిష్ణ మృతికి పలువురు స్థానికంగా సంతాపసభ ఏర్పాటుచేసి శ్రద్ధ్దాంజలి ఘటించారు. మిట్టఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్వర్యం లో క్రిష్ణ చిత్రపటానికి, అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కోనాపురం నా రాయణస్వామి, రవిశంకర్‌ గురూజీ, కోగిర జయచంద్రారెడ్డి, మూర్తి, జగ్గు, రాము, సుబ్బన్న, వెంకటేశ, వంశీ, రవూఫ్‌ పాల్గొన్నారు. అదేవి ధంగా శ్రీసత్యసాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జాబిలి చాంద్‌బాషా ఆధ్వర్యంలో కృష్ణ మృతికి సంతాపసభ నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులుఅర్పించారు. ఆయన మృతి కళారంగానికి తీరనిలోటు అన్నారు. కృష్ణతో తనకున్న పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు. కృష్ణ దంపతులను 2014లో హైదరాబాద్‌లో రెండుసార్లు కలిసి భోజనం చేశా మన్నారు. ఇది నా జీవితంలో మరిచిపోలేని గుర్తుగా ఉండి పోతుందని జ్ఞా పకాలను పం చుకున్నారు.

Updated Date - 2022-11-16T00:00:10+05:30 IST