రాష్ట్రాన్ని డ్రగ్స్‌మయం చేశారు: తెలుగు యువత

ABN , First Publish Date - 2022-12-15T00:08:30+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి ఏమైనా ఉందంటే రాష్ట్రాన్ని డ్రగ్స్‌ ఆంధ్రప్రదేశగా మార్చడమేనంటూ తెలుగు యువత నాయకులు విమర్శించారు.

రాష్ట్రాన్ని డ్రగ్స్‌మయం చేశారు: తెలుగు యువత

హిందూపురం, డిసెంబరు 14: వైసీపీ అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి ఏమైనా ఉందంటే రాష్ట్రాన్ని డ్రగ్స్‌ ఆంధ్రప్రదేశగా మార్చడమేనంటూ తెలుగు యువత నాయకులు విమర్శించారు. బుధవారం తెలుగు యువత ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి చిన్నమార్కెట్‌ నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. తెలుగుయువత, టీడీపీ నాయకులు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వ నిరంకుశ విధానాలపై నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి డ్రగ్స్‌ మాఫియాను అరికట్టడంలో విఫలమయ్యారా? లేక ఆయనకూడా ఇందులో భాగస్వామ్యం ఉందా? అని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో డ్రగ్స్‌ వల్ల యువత జీవితం నాశనమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్‌ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి ఎగువింటి శ్రీనివాసులు, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి రమేష్‌, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌ సురేంద్రయాదవ్‌, సర్పంచ మంజునాథ్‌, నరేష్‌ యాదవ్‌, భార్గవ్‌, సికిందర్‌, అమీన, చైతన్య, సురేష్‌, సునీల్‌, సోమగట్ట మంజునాథ్‌, షబ్బీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:08:32+05:30 IST