మహిళా సంరక్షణ కార్యదర్శుల సేవలు ప్రశంసనీయం : డీఎస్పీ

ABN , First Publish Date - 2022-01-03T05:53:15+05:30 IST

వార్డు సచివాలయాలకు అనుసంధానంగా మహి ళా సంరక్షణ కార్యదర్శుల సేవలు ప్రశంసనీయంగా ఉన్నాయని డీఎస్పీ నరసింగప్ప పేర్కొన్నారు.

మహిళా సంరక్షణ కార్యదర్శుల సేవలు ప్రశంసనీయం : డీఎస్పీ
మహిళా సంరక్షణ కార్యదర్శులచే కేక్‌ కట్‌ చేయిస్తున్న డీఎస్పీ నరసింగప్ప

గుంతకల్లు, జనవరి 2: వార్డు సచివాలయాలకు అనుసంధానంగా మహి ళా సంరక్షణ కార్యదర్శుల సేవలు ప్రశంసనీయంగా ఉన్నాయని డీఎస్పీ నరసింగప్ప పేర్కొన్నారు. ఆదివారం స్థానిక వనటౌన పోలీసుస్టేషనలో నిర్వహించిన మహిళా సంరక్షణ కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసు శా ఖకు ఉపయోగకరమైన సేవలందిస్తున్నారని తెలిపారు. అనంతరం మహిళా సంరక్షణ కార్యదర్శులచే కేక్‌ కట్‌ చేయించిన డీఎస్పీ కొత్తఏడాది వేడుకలు చేశా రు. కార్యక్రమంలో సీఐలు ఎం నాగశేఖర్‌, టీసీహెచ గోవిందు, బీ లక్ష్మన్న, ఎస్‌ఐ లు కే సురేశబాబు, వీ శ్రీనివాసులు, కే రాజశేఖర్‌, నరేంద్ర పాల్గొన్నారు. 


Read more