వైసీపీ నేత ఇంట్లో పేకాట స్థావరం
ABN , First Publish Date - 2022-01-10T05:41:42+05:30 IST
వైసీపీ నేత ఇంట్లో పెద్దఎత్తున పేకాట స్థావరం నడుపుతున్నట్లు బహిర్గతమైంది. వైసీపీ నేతలు, ఆ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి, ఉద్యోగి, కాంట్రాక్టరు తదిత రులు పేకాట ఆడుతుండగా.. పోలీసులు దాడులు చేసి, పట్టుకున్నారు.
స్పెషల్ పార్టీ పోలీసుల దాడుల్లో పెద్దఎత్తున నగదు స్వాధీనం?
14 మంది అదుపులోకి.. వారిలో నేతలు, ఉద్యోగి..
గుత్తి, జనవరి 9: వైసీపీ నేత ఇంట్లో పెద్దఎత్తున పేకాట స్థావరం నడుపుతున్నట్లు బహిర్గతమైంది. వైసీపీ నేతలు, ఆ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి, ఉద్యోగి, కాంట్రాక్టరు తదిత రులు పేకాట ఆడుతుండగా.. పోలీసులు దాడులు చేసి, పట్టుకున్నారు. పట్టణంలోని వైసీపీ నేత, మాజీ ఎంపీపీ కోనా మురళీధర రెడ్డి ఇంట్లో పేకాట స్థావరం నిర్వహిస్తున్నాడన్న సమాచారం మేరకు ఆదివారం రాత్రి స్పెషల్ పార్టీ (ఎస్‌ఓజీటీ) పోలీసులు దాడులు చేశారు. సివిల్ డ్రెస్సుల్లో వెళ్లిన పోలీసులు కోనా ఇంట్లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కోనా మురళీధరరెడ్డితోపాటు, మండలంలోని కరిడికొండ సర్పంచ రమేశ, లక్షానుపల్లి మాజీ సర్పంచ రామిరెడ్డి, గుత్తిలో విద్యుత శాఖ లైనమనగా పనిచేస్తున్న గంగరాజు, వైసీపీకి చెందిన వెంకటేశ, పలువురు కాంట్రాక్టర్లు తదితరులు కలిపి మొత్తం 14 మందిని అరెస్టు చేసినట్లు సీఐ శ్యామరావు తెలిపారు. వారిని రహస్య ప్రదేశానికి తరలించారు. వారి నుంచి పెద్దమొత్తంలో నగదు, 10 ద్విచక్రవాహనా లు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వాహనాలను స్థానిక పోలీసు స్టేషనకు తరలించారు. మాజీ ఎంపీపీ కోనా కుమారుడు నిషాంతకుమార్ రెడ్డితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నట్లు తెలిసింది. పేకాట స్థావరం ఎన్నాళ్ల నుంచి నిర్వహిస్తున్నారో పోలీసులు తెలపాల్సి ఉంది. ఇంటి వెనుక వైపు నుంచి పేకాట రాయుళ్లను పిలిపించుకుని జూదం నిర్వహిస్తున్న ట్లు సీఐ తెలియజేశారు. దీనిపై అందిన పక్కా సమాచారం మేరకు ఎస్‌ఓజీటీ పోలీసులు రెండురోజులపాటు రెక్కీ నిర్వహించి, దాడులు చేశారు. ఆదివారం కావడంతో ఎక్కువమంది పేకాట ఆడటానికి రావడంతో దాడుల్లో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు తె లుస్తోంది.