నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి
ABN , First Publish Date - 2022-12-16T23:52:52+05:30 IST
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ నూతన విద్యావిధానాన్ని(ఎనఈపీ) రద్దు చేయాలని ఆల్ ఇండియూ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ కాన్ఫడరేషన (ఏఐయూఈసీ) తీర్మానం చేసినట్లు ఆ సంఘం కార్యదర్శి, ఎస్కేయూ అసిస్టెంట్ రిజిస్ర్టార్ తిమ్మప్ప తెలిపారు. శుక్రవారం బిహార్‌లోని లలిత నారాయణ్ మిథిలా యూనివర్సిటీలో నిర్వహించిన న్యూఢిల్లీ 14వ కాన్ఫరెన్స, జాతీయ సెమినార్‌కు తిమ్మప్పలోపాటు ఏఐయూఈసీ సభ్యులు, ఎడిటర్ వాయిస్ ఆఫ్ యూనివర్సిటీ ఎంప్లాయీస్ నాగప్ప హాజరైనట్లు తెలిపారు.
ఏఐయూఈసీ తీర్మానం
అనంతపురం సెంట్రల్, డిసెంబరు 16: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ నూతన విద్యావిధానాన్ని(ఎనఈపీ) రద్దు చేయాలని ఆల్ ఇండియూ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ కాన్ఫడరేషన (ఏఐయూఈసీ) తీర్మానం చేసినట్లు ఆ సంఘం కార్యదర్శి, ఎస్కేయూ అసిస్టెంట్ రిజిస్ర్టార్ తిమ్మప్ప తెలిపారు. శుక్రవారం బిహార్‌లోని లలిత నారాయణ్ మిథిలా యూనివర్సిటీలో నిర్వహించిన న్యూఢిల్లీ 14వ కాన్ఫరెన్స, జాతీయ సెమినార్‌కు తిమ్మప్పలోపాటు ఏఐయూఈసీ సభ్యులు, ఎడిటర్ వాయిస్ ఆఫ్ యూనివర్సిటీ ఎంప్లాయీస్ నాగప్ప హాజరైనట్లు తెలిపారు. వారు మాట్లాడుతూ ఎనఈపీతో దేశంలోని వర్సిటీల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర ఉద్యోగులపై తీవ్రప్రభావం అన్న అంశంపై సుధీర్ఘంగా చర్చించినట్లు వివరించారు. వర్సిటీల బోధనేతర ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించేలా ప్రధానికి రాసిన లేఖను ఆమోదించామన్నారు. దేశమంతా ఒకే పెన్షన, ఒకే జీతంలాగానే బోధనేతర సిబ్బందికి యూజీసీ స్కేల్ అమలుచేసి సర్వీస్ రూల్స్ అమలుకు డిమాండ్ చేశామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్‌చేసి ఖాళీలను భర్తీ చేయాలన్న ఏకగ్రీవ తీర్మానంతో కూడిన వినతిపత్రాన్ని యూజీసీ చైర్మన, హెచఆర్‌డీ మినిస్టర్‌కు సమర్పించామన్నారు. అనంతరం ఏఐయూఈసీ సావనీర్‌ను ఆవిష్కరించినట్లు వెల్లడించారు.