జ్యోతిరావు ఫూలే జీవితం అందరికీ ఆదర్శం
ABN , First Publish Date - 2022-04-12T04:54:24+05:30 IST
మహాత్మ జ్యోతిరావుఫూలే జీవితం అందరికీ ఆదర్శమని జిల్లా కలెక్టర్ బసంతకుమార్ పేర్కొన్నారు.
-కలెక్టర్ బసంతకుమార్
పుట్టపర్తి, ఏప్రిల్ 11: మహాత్మ జ్యోతిరావుఫూలే జీవితం అందరికీ ఆదర్శమని జిల్లా కలెక్టర్ బసంతకుమార్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో కులవివక్ష, అంటరానితనం, నిర్మూలనకు కృషి చేసిన తొలి వ్యక్తి ఫూలే అని కొనియాడారు. కార్యక్రమంలో జేసీ చేతన, డీఆర్వో గంగాధర్ గౌడ్, ఆర్డీఓ భాగ్యరేఖ, ఇతర అధికారులు శివరంగప్రసాద్, నరేంద్ర, విజయ్‌కుమార్, బీసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.