ఆదర్శప్రాయుడు అంబేడ్కర్‌

ABN , First Publish Date - 2022-05-17T06:12:18+05:30 IST

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రపంచానికే మేధావి, ఆదర్శప్రాయుడని వక్తలు కొనియాడా రు. స్థానికంగా సోమవారం నూతనంగా ఏర్పాటుచేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఆదర్శప్రాయుడు అంబేడ్కర్‌
సమావేశంలో మాట్లాడుతున్న గుండుమల తిప్పేస్వామి

విగ్రహావిష్కరణ సభలో వక్తలు


ఆగళి, మే16: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రపంచానికే మేధావి, ఆదర్శప్రాయుడని వక్తలు కొనియాడా రు. స్థానికంగా సోమవారం నూతనంగా ఏర్పాటుచేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభకు స ర్పంచ లక్ష్మమ్మ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్న, రాష్ట్ర ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ, రాష్ట్ర టీ డీపీ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు, రైల్వే పీఎ్‌ససీ మెంబర్‌ తలుపుల గంగాధర్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వజ్రభాస్కర్‌రెడ్డి, రా యలసీమ జోనల్‌ ఇనచార్జ్‌ చంద్రశేఖర్‌ హాజరై మాట్లాడారు. స మాజంలో మనుషుల్లో మార్పు రావాలన్నారు. నేటికీ గ్రామాల్లో అంటరానితనం కొనసాగుతూనే ఉందన్నారు. ప్రతి మండలంలో నూ అంబేడ్కర్‌ భవనాలు నిర్మిస్తామన్నారు. అంబేడ్కర్‌ దళితుల కు మాత్రమే కాదని, సమాజంలో ఉన్న ప్రతివ్యక్తికి, ప్రతి కులాని కి ఆదర్శప్రాయుడని కొనియాడారు. దళితులు విద్యను అభ్యసించినప్పుడే సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు. అంబేడ్కర్‌ రా జ్యాంగాన్ని రచించడంతోనే దళితులు ఈస్థాయిలో ఉన్నారన్నారు.  స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా నేటికీ దళితులను చిన్నచూ పు చూస్తున్నారన్నారు. అంతకుముందు ముఖ్యఅతిథుల చేతుల మీదుగా అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో దండోరా హనుమంతు, మాజీ ఎంపీపీ ఎల్‌కే నరసింహులు, లా యర్‌ ఆశ్వర్థనారాయణ, పలు రాజకీయ, ప్రజాసంఘాల ప్రతినిధు లు, ఎమ్మార్పీఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-17T06:12:18+05:30 IST