న్యాయఫలాలను ప్రజలకు చేరవేయాలి

ABN , First Publish Date - 2022-09-25T05:21:42+05:30 IST

న్యాయవ్యవస్థ ద్వారా ప్రజలకున్న సౌలభ్యాలను ప్రజలకు చేరవేసే ప్రయత్నంలో భా గంగా పరా లీగల్‌ వంటీర్ల నియామకమని మండల న్యాయ అధికార సేవా సంస్థ ఛైర్మన, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం. వెంకటేశ్వరరావు అన్నారు.

న్యాయఫలాలను ప్రజలకు చేరవేయాలి
మాట్లాడుతున్న జడ్జి వెంకటేశ్వరరావు

వలంటీర్ల సదస్సులో న్యాయమూర్తి వెంకటేశ్వరరావు 

కదిరి లీగల్‌, సెప్టెంబరు 24: న్యాయవ్యవస్థ ద్వారా ప్రజలకున్న సౌలభ్యాలను ప్రజలకు చేరవేసే ప్రయత్నంలో భా గంగా పరా లీగల్‌ వంటీర్ల నియామకమని మండల న్యాయ అధికార సేవా సంస్థ ఛైర్మన, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం. వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం కోర్టు ఆవరణంలో వలంటీర్లకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చట్టాలపైన అవగాహన కల్పన కోసం ఈసదస్సు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. న్యాయ వ్యవస్థ ద్వారా పనిచేస్తూ, గ్రామీణ ప్రాంతంలోని సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కార మార్గాన్ని వ్యవస్థ ద్వారా అందించడానికి వలంటీర్ల వ్యవస్థ ఆవిర్భావించిందన్నారు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత వలంటీర్లపై ఉందన్నారు. ఈ సదస్సులో న్యాయవాదులు పాల్గొన్నారు. 

Read more