దొరిగిన నగల బ్యాగు పోలీసులకు అప్పగింత
ABN , First Publish Date - 2022-12-15T00:08:39+05:30 IST
ఓ ఆర్టీసీ ప్రయాణికురాలు హోటల్‌లో మరిచి పోయిన బంగారు నగల బ్యాగ్‌ను పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్న సంఘటన గుత్తి పట్టణంలో చోటుచేసుకుంది.
గుత్తి, డిసెంబరు 14: ఓ ఆర్టీసీ ప్రయాణికురాలు హోటల్‌లో మరిచి పోయిన బంగారు నగల బ్యాగ్‌ను పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్న సంఘటన గుత్తి పట్టణంలో చోటుచేసుకుంది. మండలంలోని ఇసురాళ్లపల్లి గ్రామానికి అరుణ జ్యోతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో తన హ్యండ్ బ్యాగ్‌ను మరచిపోయి రైల్వే స్టేషన్‌కు వెళ్లిపో యిం ది. అయితే అక్కడికి వెళ్లిన తరువాత బ్యాగ్ కనిపించకపోవడంతో అందో ళనతో తిరిగి హోటల్ వద్దకు వచ్చి విచారించింది. అయితే హ్యండ్ బ్యాగ్ లభించకపోవడంతో తన బ్యాగ్ చోరీకి గురైందని భావించి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బ్యాగ్‌లో 8 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయని బాధితురాల పోలీసుల వద్ద బోరున విలపించింది. దీంతో పోలీసులు హోటల్ వద్దకు వెళ్లి విచారిస్తుండగా సమీపంలోనే అక్కడే ఉన్న మాబున్నీ అనే ప్రయాణికురాలు తనకు బ్యాగ్ దొరికిందంటూ పోలీసులకు అప్పగించింది. ఆ బ్యాగ్‌ను వెంటనే అరుణ జ్యోతి అప్పగించారు. బ్యాగ్‌లో ఉన్న ఆభరణాలను చూసుకోగా నగలు ఉండటంతో ఆమె ఊపిరి పీల్చు కుంది. మాబున్నీని సీఐ వెంకటరామిరెడ్డి అభినందించారు.