చిన్నమ్మ దేవత పెట్టెకు ఘనంగా పూజలు
ABN , First Publish Date - 2022-05-22T06:25:31+05:30 IST
మండలంలోని వంకరకుంట సమీపాన ఉన్న చిన్నమ్మ దేవత పరుస సోమవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు జరగనుంది.
నల్లమాడ, మే 21: మండలంలోని వంకరకుంట సమీపాన ఉన్న చిన్నమ్మ దేవత పరుస సోమవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు జరగనుంది. దీంతో చిన్నమ్మకు సంబంధించిన ఆభరణాలు ఆమె పుట్టినిల్లు అయిన బత్తినపల్లి లో పెట్టెలో ఉంటాయి. పరుస ప్రారంభం సమయంలో వా టిని ఉరాల వాయిద్యాలతో ఊరేగిం పుగా వంకరకుంటకు తీసుకొనివెళ్తారు. దీంతో బత్తినపల్లి నుంచి చౌటకుంట పల్లి, నల్లమాడ, కొత్తపల్లి, చెరువువాం డ్లపల్లి మీదుగా పెట్టెను తీసుకెళ్తారు. దీంతో ఆయా గ్రామాల మహిళలు కాయకర్పూరాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. పరుసలో భాగం గా సోమవారం తేదీన ఎలవ, మంగళవారం బండ్ల ఊరేగింపు, 25న కుంకాలతో చిన్నమ్మ పరుస ముగిస్తుందని పూజారులు తెలిపారు.