మున్సిపల్ కమిషనర్‌పై దాడి హేయం
ABN , First Publish Date - 2022-06-25T06:04:33+05:30 IST
రాయచోటి కమిషనర్ రాంబాబుపై వైసీపీ కౌన్సిలర్ దాడిచేయడం హేయమైన చర్య అని, కౌన్సిలర్‌పై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున డిమాండ్ చేశారు.

వారిపై చర్యలు తీసుకోవాలి: మున్సిపల్ అధికారుల నిరసన
ధర్మవరం, జూన 24: రాయచోటి కమిషనర్ రాంబాబుపై వైసీపీ కౌన్సిలర్ దాడిచేయడం హేయమైన చర్య అని, కౌన్సిలర్‌పై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ రాష్ట్ర మినిసీ్ట్రరియల్ సంఘం పిలుపుమేరకు శుక్రవారం స్థానిక మున్సి పల్ కార్యాలయం ఎదుట కమిషనర్, అధికారులు నల్లబ్యాడ్జీలు ధఽరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... ఉన్నతాధికారైన మున్సిపల్ కమిషనర్‌పై దాడిచేయడం సమంజసంకాదని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా ఉంటూ ప్రభుత్వం సంక్షేమపథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్యాలయ మేనేజర్ ఆనంద్, టీపీఓ నాగవల్లి, జేఏఓ శ్రీనివాసులు, శ్రీకుమార్, రవి, లక్ష్మీనారాయణశర్మ, ఆనంద్, వన్నూర్‌స్వామి, ఆసీఫ్, ప్రతాప్, హరీశ తదితరులు ఉన్నారు.
కదిరిలో...
కదిరి: రాయచోటి మున్సిపల్ కమిషనర్ రాయప్రోలుపై కొంతమంది వ్యక్తులు దౌర్జన్యం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం కదిరి మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ... ఉద్యోగులకు భద్రత కల్పించాలని, సమన్వయంతో కలిసి పనులు చేసుకోవాలన్నారు. ఇలాంటి సంఘట నలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సి పల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాంబశివయ్య, ఆర్వో అశ్వత్థనా రాయణ, మేనేజర్ లక్ష్మీదేవమ్మ, డీఈ గోపీనాథ్, టీపీఓ విజయభాస్కర్, ఏజేఓ శ్రావణి, శానటరీ ఇనస్పెక్టర్ సీవీ రమణ, మహమ్మద్‌ముజీబ్, దినేష్‌కుమార్, ప్రేమ కుమార్, హరిప్రసాద్, శ్రీనివాసులు, మున్సిపల్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.