హైవేకి టెండర్లు ఖరారు
ABN , First Publish Date - 2022-12-16T00:05:47+05:30 IST
ఎట్టకేలకు అనంతపురం నుంచి గుంటూరు జాతీయ రహదారికి రూట్ క్లియరైంది. సుమారు రూ. 9 వేల కోట్లతో (ఎనహెచ 544-డీ) 417.91 కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేయాలని జాతీయ రహదారుల సంస్థ (ఎనహెచఏఐ) సంకల్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఇటీవల సంబంధిత జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్ల పక్రియ నిర్వహించి ఖరారు చేశారు.
అనంతపురం నుంచి గుంటూరు మధ్య నాలుగు లేన్ల రోడ్డు
ఎనహెచ 544-డీ నిర్మాణానికి గ్రీనసిగ్నల్
జిల్లా పరిధిలో 71 కిలోమీటర్లు
రెండేళ్లలో పూర్తి చేయాల్సిందే
అనంతపురం నుంచి గుంటూరు జాతీయ రహదారి (544-డీ) : 417.91 కిలోమీటర్లు
రోడ్డు నిర్మాణానికి సంబంధించి నిధులు : రూ.9 వేల కోట్లు
జిల్లా పరిధిలో వేయనున్న రోడ్డు పొడవు: 71.380 కిలోమీటర్లు
ఈ రోడ్డు నిర్మాణానికి ఖర్చు రూ. 1423.12 కోట్లుఒకటో ప్యాకేజీ
దూరం: 39.380 కి.మీ. వ్యయం: రూ.684.30
రెండో ప్యాకేజీ దూరం: 32 కి.మీ. వ్యయం: రూ.738.82 కోట్లు
కాంట్రాక్టు సంస్థలు ఎస్‌ఆర్‌సీ ఇనఫ్రా డెవలపర్స్, మేఘా ఇంజనీరింగ్ సంస్థ
అనంతపురం సిటీ, డిసెంబరు 15: ఎట్టకేలకు అనంతపురం నుంచి గుంటూరు జాతీయ రహదారికి రూట్ క్లియరైంది. సుమారు రూ. 9 వేల కోట్లతో (ఎనహెచ 544-డీ) 417.91 కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేయాలని జాతీయ రహదారుల సంస్థ (ఎనహెచఏఐ) సంకల్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఇటీవల సంబంధిత జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్ల పక్రియ నిర్వహించి ఖరారు చేశారు. తద్వారా అనంత టు గుంటూరు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లైంది. ఈ నేపథ్యంలో జిల్లా పరిధిలో 71 కిలోమీటర్లు వరకు ఈ రోడ్డు వేయనున్నారు. ఈ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తయితే జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది..
అనంత టు గుంటూరు...
ఎనహెచఏఐ అధికారులు ప్రకారం అనంతపురం నుంచి గుంటూరు వరకు 417.91 కిలోమీటర్లు (నాలుగు లేన్ల జాతీయ రహదారి) 544-డీ నిర్మాణానికి గ్రీనసిగ్నల్ లభించింది. ఈ ప్రకారం ఈరోడ్డు జిల్లాలో 71.380 కిలోమీటర్ల మేర నిర్మించినున్నారు. ఈ రోడ్డు నిర్మాణం త్వరగా జరిగితే ఇటు అనంతపురం జిల్లాతో పాటు శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలకు కూడా ఎంతో ఉపయోగరకరంగా మారనుంది. అనంతపురం నుంచి గుంటూరు వెళ్లేందుకు కూడా సమయం తగ్గనుంది.
టెండర్లు ఇలా.....
జాతీయ రహదారుల నిర్మాణాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఇటీవల ఉత్కంఠగా సాగింది. అనంతపురం నుంచి గుంటూరు (544-డీ) లో భాగంగా జిల్లా పరిధిలోని 71.380 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం రెండు ప్యాకేజీలుగా టెండరు పక్రియ సాగింది. ఈ ప్రకారం...
మొదటి ప్యాకేజీ కింద అనంతపురం నగర శివారు పామురాయి గ్రామం నుంచి ముచ్చకోట వరకు 39.380 కిలోమీటర్లు మేర రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. రూ. 884.30 కోట్లతో టెండర్లు పిలిచారు. చాలామంది టెండర్లు దాఖలు చేశారు. అనుహ్యంగా అంచనా కంటే 1.12 శాతం తక్కువ కోడ్ చేసిన ఎస్‌ఆర్‌సీ ఇనఫ్రా డెవలపర్స్‌కి దక్కింది.
రెండో ప్యాకేజీ కింద ముచ్చకోట నుంచి బుగ్గ వరకు కలిగిన 32కి కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని రూ. 738.82 కోట్ల అంచనా విలువతో టెండర్లు పిలిచారు. ఆయితే అంచనా కంటే 0.74 శాతం తక్కువ కోడ్ చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఈ కాంట్రాక్ట్ దక్కింది.
త్వరలో పనులు...
టెండర్లు దక్కించుకోవడమే కాదు.. పనులు కూడా సకాలంలో పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం షరతు విధించింది. సాధారణంగా చాలా వరకు సకాలంలో పనులు పూర్తి అయ్యే పరిస్థితి ఉండదు. కానీ ఈ రోడ్డు నిర్మాణం రెండు ప్యాకేజీలు కింద ఏ విధంగా జరుగుతుందో వేచిచూడాలి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ పనులను రెండేళ్లలోపు పూర్తి చేయాలని ఆయా కాంట్రాక్టు పొందిన సంస్థల ప్రతినిధులను అదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు కూడా త్వరలోనే పనులు ప్రారంభించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు ఆశాఖ వర్గాల నుంచి తెలిసింది.
టీడీపీ హయాంలోనే...
గత ప్రభుత్వ హయాంలోనే అనంతపురం నుంచి గుంటూరు వరకు ఎక్స్‌ప్రెస్ వే కోసం ఎనహెచఏఐ అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే వివిధ కారణాలతో ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వం పున:పరిశీలన చేసి అనంతపురం నుంచి కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఇదివరకే ప్రకాశం జిల్లా గిద్దలూరు, గుంటూరు జిల్లా వినుకొండ మధ్య రహదారి నిర్మాణాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే రహదారికి అనుగుణంగా అనంతపురం, గుంటూరు మధ్య నాలుగు లేన్ల రహదారికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి టెండర్లు సైతం ఇటీవల ఖరారు చేసింది.