కంది రైతును ఆదుకోవాలి
ABN , First Publish Date - 2022-12-16T23:55:39+05:30 IST
వర్షం కారణంగా కంది పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి డిమాండ్ చేశారు.
రొద్దం, డిసెంబరు 16: వర్షం కారణంగా కంది పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని ఆర్.మరువపల్లి సమీపంలోని కంది చేలను టీడీపీ నాయకులతో కలిసి బీకే పరిశీలించారు. రైతులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. బీకే మాట్లాడుతూ.. కోత దశలో ఉన్న పంట ఇటీవల కురిసిన అధిక వర్షాలకు దెబ్బతిందన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు మద్దతు ధర రూ.10వేలు, ఎకరానికి రూ.10వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, నాయకులు రొద్దం నరసింహులు, చిన్నప్పయ్య పాల్గొన్నారు.