సీఎం అసమర్థ పాలనతోనే ప్రజలకు కష్టాలు

ABN , First Publish Date - 2022-09-28T05:38:41+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అసమర్థ పాలన కారణంగానే ప్రజలు కష్టాలు పడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ధ్వజమెత్తారు.

సీఎం అసమర్థ పాలనతోనే ప్రజలకు కష్టాలు

బాదుడే బాదుడులో బీకే ధ్వజం

పెనుకొండ రూరల్‌, సెప్టెంబరు 27: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అసమర్థ పాలన కారణంగానే ప్రజలు కష్టాలు పడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ధ్వజమెత్తారు. మండలంలోని గొల్లపల్లి, చంద్రగిరి గ్రామాల్లో టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీకే పార్థసారథి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు పెంచి, పన్నుల భారం మోపుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే ఏడాదికి రూ.60వేలదాకా రైతులపై భారం పడుతుందన్నారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతం రూపు రేఖలు మార్చిన చంద్రబాబు నాయుడును మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరిన్ని పరిశ్రమలు వస్తాయన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కక్షలు కార్పణ్యాలతో రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తోందన్నారు. దానిని అంతమొందించే రోజులు దగ్గరపడ్డాయన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ సిద్దయ్య, పట్టణ కన్వీనర్‌ రవిశంకర్‌, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, జిల్లా అధికార ప్రతినిధి రఘువీర చౌదరి, కేశవయ్య, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రెడ్డి, నాయకులు బాబుల్‌రెడ్డి, అశ్వత్థప్ప, రామలింగ, సూర్యనారాయణ, రాజు, పోతిరెడ్డి పాల్గొన్నారు.


Read more