సర్పంచకు షోకాజ్ నోటీసుపై టీడీపీ ఆగ్రహం
ABN , First Publish Date - 2022-12-16T23:42:55+05:30 IST
మండలంలోని ఎన.హనుమాపురం గ్రామ టీడీపీ మద్దతు దారు సర్పంచ జయరామ్చౌదరికి అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేయడంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కణేకల్లు, డిసెంబరు 16: మండలంలోని ఎన.హనుమాపురం గ్రామ టీడీపీ మద్దతు దారు సర్పంచ జయరామ్చౌదరికి అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేయడంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండలానికి చెందిన టీడీపీ నాయకులంతా ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని సర్పంచకు షోకాజ్ నోటీసు జారీ చేయడంపై ఎంపీడీవో శ్రీనివాసులు, ఈవోఆర్డీ గూడెన్నను ప్రశ్నించారు. టీడీపీ నాయకులు మూకుమ్మడిగా శుక్రవారం కార్యాలయానికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి రెండేళ్ల క్రితం టీడీపీ మద్దతుతో జయరామ్చౌదరి సర్పంచగా ఎన్నిక కాగా ఇప్పటివరకు ఆ గ్రామానికి ఎలాంటి నిధులు మంజూరు చేయలేదన్నారు. కానీ గ్రీన అంబాసిడర్లకు జీతాలు ఇవ్వకపోవడంపై అధికారులు సర్పంచకు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో ఒక్కసారిగా సర్పంచ జయరామ్చౌదరికు ఆవేశం కట్టలు తెంచుకుంది. గ్రామంలో అనేక సమస్యలతో నిధులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వీటికి నిధులు మంజూరు చేయాల్సిన ప్రభుత్వం దాని గురించి ఏమాత్రం పట్టించుకోకపోగా మరలా ఈ విధంగా షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంపీటీసీ నరేంద్ర, కన్వీనర్ లాలెప్ప, క్లస్టర్ ఇనఛార్జ్లు ఆనందరాజు, మారుతి, వేలూరు మరియప్ప, అనిల్, షేక్ ముజ్జు, శరబనగౌడ్, చాంద్ బాషా, బాయినేని నవీన, అశోక్, రుద్రముని, ఆనందరెడ్డి, ప్రకాష్, విజయ్, వెంకటేశులు, దేవదాసు, రామచంద్ర, షేక్ హుస్సేన, మహేష్, ఈరప్పతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.