జగనకు మంచి బుద్ధి ప్రసాదించు స్వామీ

ABN , First Publish Date - 2022-10-07T05:42:21+05:30 IST

మూడు రాజధానుల పేరుతో అరాచకపాలన సాగిస్తున్న సీఎం జగన మోహన రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించుస్వామి అంటూ సాయిబాబా ఆలయం ఎదుట టీడీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టారు.

జగనకు మంచి బుద్ధి ప్రసాదించు స్వామీ
సాయిబాబా ఆలయం ఎదుట టెంకాయలు కొడుతున్న టీడీపీ నాయకులు

సాయిబాబాను ప్రార్థించిన టీడీపీ నాయకులు

అనంతపురం అర్బన, అక్టోబరు 6: మూడు రాజధానుల పేరుతో అరాచకపాలన సాగిస్తున్న సీఎం జగన మోహన రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించుస్వామి అంటూ సాయిబాబా ఆలయం ఎదుట టీడీపీ నాయకులు  కొబ్బరికాయలు కొట్టారు. తెలుగు యువత రాష్ట్రప్రచార కార్యదర్శి బంగి నాగ ఆధ్వర్యంలో గురువారం పార్టీ నాయకులు, కార్యకర్తలు 101 కొబ్బరి కాయలు కొట్టారు. రాషా్ట్రనికి అమరావతిని రాజధానిగా కొనసాగించకుండా, స్వార్థ రాజకీయాలు చేయడం సరికాదని నాగ అన్నారు. ఇప్పటికైనా జగన కళ్లుతెరిచి, ఏపీకి ఒకే రాజధాని ఉండేలా చూడాలని సూచించారు. లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు  దేవళ్ల మురళి, గుర్రం నాగభూషణం, పోతుల లక్ష్మీనరసింహులు, పావురాల శేఖర్‌, పీఎం లక్ష్మీప్రసాద్‌, మనోహర్‌, బొమ్మినేని శివ,  దబ్బర రాజేష్‌, 

బోయ శ్రీనివాసులు, రవికుమార్‌ చౌదరి, జయం బాషా, సిరిశాల రాంబాబు, జేఎం బాషా, తెలుగు మహిళ నాయకురాలు మనెమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Read more