విద్యార్థిని అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2022-07-06T06:33:25+05:30 IST
మండలంలోని పెడకట్టివారిపల్లితండాకు చెందిన డిగ్రీ విద్యార్థిని నాగమునెమ్మ(19) అనుమానాస్పద స్థితితో మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.

నంబులపూలకుంట, జూలై 5: మండలంలోని పెడకట్టివారిపల్లితండాకు చెందిన డిగ్రీ విద్యార్థిని నాగమునెమ్మ(19) అనుమానాస్పద స్థితితో మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ్ఞగ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి సమీపంలోని చిన్న బావిలో మంగళవా రం ఉదయం గ్రామస్థులు ఓ యువతి మృతదేహం గుర్తించారు. వెంటనేపోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమా ర్టం నిమి త్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. అయితే ఎటువంటి సమాచారం లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు గుర్తించారు. ఇదిలాఉండా సాయంత్రం గ్రామానికి సమీపంలోని బ్రిడ్జి వద్ద చెట్ల మధ్యలో ఓ నల్లని బ్యాగు గ్రామస్థులకు దొరికింది. అందులో ఉన్న ఐడెంటిటీ కార్డు, సెల్‌ఫోనును బట్టి వారు అవి తమగ్రామానికి చెందని యువతి విగా గుర్తించారు. వాటిని బట్టి పెడకట్టివారిపల్లితండాకు చెందిన నాగమునెమ్మ తిరుపతి మెడికల్ కళాశాలలో బీఎస్సీ ఎంఎల్టీ రెండో సంవత్సరం చదుతున్న ట్లు గుర్తించారు. ఈ క్రమంలో గ్రామంలో నివాసమున్న మృతురాలి తల్లి ఈశ్వ రమ్మ తన బిడ్డకు ఫోన చేయగా స్విచ ఆఫ్ రావడంతో అనుమానం వ్యక్తం చేసింది. వెంటనే పోలీస్‌స్టేషనలో ఎస్ఐ సద్గురుడుకు ఫిర్యాదు చేసింది. ఆమె ఆసుపత్రికి వెళ్లి మృతిచెందిన విద్యార్థిని తన కుమారై అని నిర్దారించినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి తెలిపిన వివరాల మేరకు... గాండ్లపెంట మండలంలోని నల్లగుట్టతండాకు చెందిన వెంకటరమణనాయక్‌తో ఈశ్వరమ్మకు 20 సంవత్సరాల క్రితం వివాహమైంది. కుమారై నాగమునెమ్మ జన్మించిన తరువా త భార్యభర్తలు విడిపోయారు. నాగమున్నెమ్మ 15 సంవత్సరాలు తండ్రి వద్దనే ఉంది. రెండేళ్ల క్రితం తల్లివద్దకు వచ్చింది. ప్రస్తుతం తిరుపతిలో డిగ్రీ చదువు తోంది. గతనెల గ్రామంలో జరిగిన ఓ వివాహానికి తన కుమారై హాజరై, తిరిగి కాలేజీకి వెళ్లింది. తోటి స్నేహితురాళ్లతో కలిసి తల్లితో ఫోనలో మాట్లాడింది. అయితే మంగళవారం బావిలో శవమై తెలిసిందని తల్లి కన్నీరుమున్నీరుగా విల పించింది. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.