రేషనషాపుల్లో కనిపించని పంచదార

ABN , First Publish Date - 2022-10-04T05:29:11+05:30 IST

పండగ పూట కూడా రేషన షాపులలో పంచదార కనిపించడం లేదు. గత నెలలో కూడా పూర్తిగా చక్కర ఎత్తివేశారు. ఈ నెలలో దసరా, దీపావళి పండుగలు ఉన్నా యి. ఈపండుగలకైనా చక్కర వస్తుందని ఆశించిన నిరుపేదలకు నిరాశే మిగిలింది.

రేషనషాపుల్లో కనిపించని పంచదార

  డీడీలు కట్టినా సరఫరా చేయని వైనం

  కందిపప్పు పంపిణీ అంతంతే

అనంతపురం టౌన, అక్టోబరు3: పండగ పూట కూడా రేషన షాపులలో పంచదార కనిపించడం లేదు. గత నెలలో కూడా పూర్తిగా చక్కర ఎత్తివేశారు. ఈ నెలలో దసరా, దీపావళి పండుగలు ఉన్నా యి. ఈపండుగలకైనా చక్కర వస్తుందని ఆశించిన నిరుపేదలకు నిరాశే మిగిలింది. కందిపప్పు సైతం అనేక ప్రాంతాల్లో అరకొర గానే పంపిణీ చేసి చేతులు దులుపుకుంటు న్నారు. డీలర్లు డీడీలు కట్టినా పంచదార సరఫరా చేయలేక చేతులెత్తేశారు. అనంత జిల్లాలో దాదాపు 700 వరకు రేషన షాపులు ఉన్నాయి. ఇందులో 609376 రేషన కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులకు నెలనెలా రేషన షాపుల నుంచి రాయితీ సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. బియ్యంతో పాటు కంది బేడలు, పంచదార, పామాయిల్‌ ఇవ్వాలి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పామాయిల్‌ను పూర్తిగా ఎత్తివేసింది. బి య్యంతో పాటు కందిబేడలు, పంచదార మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు అవి కూడా సక్రమంగా పంపిణీ చేయడం లేదని పలువు రు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

  కొన్ని నెలలుగా జిల్లాలోని అనేక మండలాల్లో కందిబేడలు, చక్కర అరకొరగా ఇస్తూ వస్తున్నారు. ఎవరైనా అడిగితే స్టాక్‌ లేదని చెబుతున్నారు. గత నెల సెప్టెంబరులో పంచదార సరఫరా చేయలేదు. ఈ నెలలో కూడా సరఫరా నిలిపేశారు. డీడీలు కట్టినా సరఫరా చేయలేదని అందుకే లబ్ధిదారులకు ఇవ్వలేకపోతున్నామని డీలర్లు చెబుతున్నారు. వాహన మిత్ర ఆపరేటర్లు కూడా మాకు బియ్యం మాత్రం ఇస్తున్నారు. వాటినే కాలనీలకు వెళ్లి లబ్ధిదారులకు ఇస్తున్నామని, ఇంతకన్నా మాకు ఏమి తెలియదని చెబుతున్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్లే సరఫరా నిలిపేశారన్న ప్రచారం సాగుతోంది. ఇది పాలకులకు తెలిసినా పట్టించుకోక పోవడం వల్లే నిరుపేదలకు సరుకులు అంద కుండా పోతున్నాయన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


Read more