మరుగుదొడ్ల పక్కనే విద్యార్థుల భోజనం

ABN , First Publish Date - 2022-01-28T05:30:00+05:30 IST

మండలంలోని ఉద్దేహాళ్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి జాగా లేకుండాపోయింది.

మరుగుదొడ్ల పక్కనే విద్యార్థుల భోజనం
మరుగుదొడ్ల పక్కనే విద్యార్థులకు అన్నం వడ్డిస్తున్న వంట ఏజెన్సీ నిర్వాహకులు

బొమ్మనహాళ్‌, జనవరి 28: మండలంలోని ఉద్దేహాళ్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి జాగా లేకుండాపోయింది. శుక్రవారం పా ఠశాల వంట ఏజెన్సీ నిర్వాహకులు విద్యార్థులకు భోజనాన్ని మరుగుదొడ్ల పక్కనే వడ్డిస్తూ కనిపించారు. చేసేది లేక చిన్నారులంతా ప్లేట్లు చేతపట్టి మరుగుదొడ్ల చు ట్టూ క్యూకట్టి నిలబడ్డారు. అపరిశుభ్రత నడుమ విద్యార్థులు భోజనం చేస్తున్నా... పాఠశాల ఉపాధ్యాయులు పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు విమర్శిస్తు న్నారు. కనీసం విద్యార్థులకు భోజనం పెట్టేందుకు కూడా ఇంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తు న్నారని మండిపడుతున్నారు. స్థలం లేకపోవడంతోనే ఇక్కడ వడ్డిస్తున్నట్లు నిర్వాహకులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరోవైపు చాలామంది విద్యార్థులు ఇంటి నుంచే క్యారియర్లలో భోజనం తెచ్చుకుని తింటున్నారు. 


Read more