నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-12-07T00:07:17+05:30 IST

కేజీబీవీల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఈఓ వెంకటకృష్ణారెడ్డి హెచ్చరించారు.

నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
మాట్లాడుతున్న వెంకటకృష్ణారెడ్డి

కేజీబీవీ ప్రిన్సిపాళ్లకు డీఈఓ హెచ్చరిక

అనంతపురం విద్య, డిసెంబరు 6: కేజీబీవీల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఈఓ వెంకటకృష్ణారెడ్డి హెచ్చరించారు. బుక్కరాయసముద్రం కేజీబీవీలో మంగళవారం ప్రిన్సిపాళ్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డీఈఓతో పాటు ఏపీసీ తిలక్‌ విద్యాసాగర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా శింగనమల కేజీబీవీలో జరిగిన ఘటనను ప్రస్తావించారు. అలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. లేకపోతే ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎంఓ హరికృష్ణ, జీసీడీఓ రెబెకా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:07:18+05:30 IST