వైసీపీ పాలనలో రాష్ట్రం అథోగతి: టీడీపీ

ABN , First Publish Date - 2022-09-27T06:03:45+05:30 IST

వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగ తి పాలైందని టీడీపీ నాయకులు విమర్శించారు. సోమవారం పట్టణంలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం అథోగతి: టీడీపీ
టీడీపీ నాయకుల మానవహారం.. కొవ్వొత్తులతో నిరసన

హిందూపురం, సెప్టెంబరు 26: వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగ తి పాలైందని టీడీపీ నాయకులు విమర్శించారు. సోమవారం పట్టణంలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు మానవహారంగా ఏర్పడి, కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పేదలపై మోపుతున్న ప న్నులు, బాదుడే బాదుడు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భం గా నాయకులు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లవుతున్నా ఆ పార్టీ నాయకులు అభివృద్ధి చెందారే తప్పా, రాష్ట్రం అభివృద్ధి చెందలేదన్నారు. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ఈ ప్రభుత్వంలో నష్టపోయారన్నారు. పేద ప్రజల నడ్డివిరిచే విధంగా చెత్తకు కూడా పన్ను వేసిన ఏకైక ప్రభుత్వం జగన్మోహనరెడ్డిదేనన్నారు. జగన పాలన తెల్లదొరలను మించిపోయిందన్నారు. తెల్లదొరలు ఆరోజు జుట్టు కు కూడా పన్నువేశారని, ఈ సీఎం చెత్తకు కూడా పన్ను వేసి చరిత్ర కు ఎక్కారన్నారు. కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శులు అంజినప్ప, రామాంజిన మ్మ, అమర్‌నాథ్‌, పరిమళ, రాము, రవీంద్రనాయుడు, రమేష్‌, టైలర్‌ గంగాధర్‌, నబీరసూల్‌, బాచి, అనిల్‌, నజీర్‌ పాల్గొన్నారు. 


Read more