చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: గుండుమల

ABN , First Publish Date - 2022-10-04T05:09:14+05:30 IST

రాష్ట్రంలో పాలన గాడి తప్పింద ని, చంద్రబాబు మరోసారి సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి అన్నారు.

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: గుండుమల
కేక్‌ కట్‌ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి

మడకశిర టౌన, అక్టోబరు 3: రాష్ట్రంలో పాలన గాడి తప్పింద ని, చంద్రబాబు మరోసారి సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని   టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి అన్నారు. సోమవారం స్థానిక బాలాజీ నగర్‌లోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు పాదయాత్ర పూర్తి చేసుకొని పదేళ్లయిన సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ రాష్ట్రంలో జగన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అభివృద్ధి కుం టుపడిందని విమర్శించారు. రాష్ట్ర విభజనతో అప్పటి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా... ఓవైపు సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు పాలనను ప రుగులు పెట్టించారన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొ ని, ప్రజల అభీష్టం మేరకు పాలన కొనసాగించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం వైసీపీ పాలనలో ఏవర్గం సంతృప్తిగా లేదని, మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చే పడితేనే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు విశ్వసిస్తున్నట్లు తెలిపా రు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షులు మంజునాథ్‌, మైనారిటీ జిల్లా టీడీపీ అధ్యక్షుడు భక్తర్‌, పట్టణ అధ్యక్షుడు మనోహ ర్‌, ప్రధాన కార్యదర్శి కన్నా, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షు డు బాలకృష్ణ, ఉపాధ్యక్షులు బేగార్లపల్లి రవి, నాయకులు జయకుమార్‌, బోర్‌వెల్‌ రామాంజనేయులు, గోపాల్‌, కార్యకర్తలు తదితరు లు పాల్గొన్నారు. 


Read more