చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

ABN , First Publish Date - 2022-12-12T23:54:07+05:30 IST

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబునాయుడు సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీడీపీనాయకులు పేర్కొన్నారు.

 చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

టీడీపీ నాయకులు

ధర్మవరం , డిసెంబరు 12: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబునాయుడు సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీడీపీనాయకులు పేర్కొన్నారు. పట్టణం లోని 23వ వార్డు టీడీపీ ఇనచార్జ్‌ అడ్రా మహేశ ఆధ్వర్యంలో సోమవారం ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే మిస్‌డ్‌కాల్‌ చేయిం చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు, ఆర్టీసీ, విద్యుత చార్జీలు, ఆస్తి, చెత్తపన్నుల పెంపుపై ప్రజలకు వివరించారు.. వైసీపీ పాలనంతా అరాచకం, రౌడీయిజం, దౌర్జన్యం, కబ్జాలకే సరిపోతోందని, ఇక రాష్ట్రం గురించి పాలకులు ఏం ఆలోచిస్తారని టీడీపీ నాయకులు మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు చికెనరాము, వెంకటేశ, మాల్యవంతం నారాయణస్వామి, షేక్‌హుస్సేన, చింతా శ్రీనివాసులు పాల్గొన్నారు.

జడివానలోనే కార్యక్రమం...

నంబులపూలకుంట: మండలంలోని తిమ్మమ్మమర్రిమాను పంచాయతీ లో సోమవారం టీడీపీ నాయకులు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం నుంచి కురుస్తున్న జడివానలోనే తిమ్మమ్మమర్రిమాను, దిగువ, ఎగువ గూటిబైలు గ్రామాల్లో కార్యక్రమం కొనసాగించారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇనచార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ ఆదేశాలతో చేపట్టగా, విశేష స్పందన వస్తోందని టీడీపీ మండల కన్వీనర్‌ చంద్రశేఖర్‌ నాయుడు, వెంకటనారాయణ, శ్రీనివాసులు, దండే రవి పేర్కొన్నారు. సైకో పాలన పోవాలి తెలుగుదేశం రావాలన్న నినాదంతో ఇదేం ఖర్మ మన రాష్ట్రాని కి కార్యక్రమం చేపట్టామన్నారు. సీఎం జగన అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజలు చాల ఇబ్బందులు పడుతున్నారని, ఏ ఇంటిలో చూసినా సమస్యలు ఏకరువు పెడుతున్నారని అన్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమానును ఎండోమెట్‌లోకి చేర్చి, దాని అభివృద్ధికి అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఆంజనప్పనాయుడు, విజయ్‌కుమార్‌యాదవ్‌, హనుమంతరెడ్డి, శేఖ ర్‌నాయక్‌, పోమేనాయక్‌, హరిప్రసాద్‌, గంగశేఖర్‌, వేణుగోపాల్‌రెడ్డి, గంగిరెడ్డి, చెన్నారెడ్డి, రవినాయక్‌, గోపాల్‌రెడ్డి, రాజారెడ్డి తదితరులున్నారు.

తనకల్లు: మండలపరిధిలోని తొట్లిపల్లి పంచాయతీలో ఉన్న దిగువ తొట్లిపల్లి, మల్లోలపల్లి, మబ్బువారిపల్లిల్లో టీడీపీ మండల కన్వీనర్‌ తొట్లి రెడ్డి శేఖర్‌రెడ్డి, తెలుగుయువత ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఇంటింటికెళ్లి ప్రజలకు కార్యక్రమం ఉద్దేశ్యాలను వివరించారు. అదుపులేని, నిలకడలేని వైసీపీ పాల నని వివరించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తెలుగుతమ్ముళ్లు ఇంటిం టికి వెళ్లడంతో ప్రజలు స్వాగతం పలికారు. ఎలాంటి సమస్యలైనా తమ దృష్టికి తీసుకు రావాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మండలకోకన్వీనర్‌ బ్రహ్మనందరెడ్డి, సీనియర్‌ నాయకులు సోంపాళ్యం నాగభూషణం, రమణ య్య, శ్రీధర్‌రెడ్డి, హరినాయక్‌, మధుకర్‌నాయుడు, ఎస్టీసెల్‌ శంకర్‌నాయక్‌, తెలుగుయువత పులి మహేష్‌, మైనార్టీ జియావుల్లా, ఉత్తన్ననాయక్‌, పురుషోత్తమరెడ్డి, కొండారెడ్డి, హసనాపురం శీనా, దామోదరం, జయరాజు, రాజేష్‌నాయక్‌, ఐటీడీపీ వేణు, తదితరులున్నారు.

Updated Date - 2022-12-12T23:54:07+05:30 IST

Read more