తిరుమలకు పాదయాత్ర ప్రారంభం
ABN , First Publish Date - 2022-12-07T23:39:41+05:30 IST
లోక కల్యాణార్థం చేపట్టే పాదయాత్రకు ప్రతి ఒక్కరి మద్దతు అవసరమని టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అంబికా లక్షీనారాయణ పేర్కొన్నారు.
హిందూపురం అర్బన, డిసెంబరు 7: లోక కల్యాణార్థం చేపట్టే పాదయాత్రకు ప్రతి ఒక్కరి మద్దతు అవసరమని టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అంబికా లక్షీనారాయణ పేర్కొన్నారు. బుధవారం వైఎనబీ గ్యారేజ్‌లో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకిలో భూదేవి శ్రీదేవి సమేత వేంకటేశ్వర స్వామి విగ్రహాలను ఊరేగింపు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. హిందూపురం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర చిలమత్తూరు, గడిదం, సోమనాథపురం, చేళూరు, చింతపర్తి, కలికిరి, భాకరాపేట, శ్రీనివాసమంగాపురం మీదుగా బయలుదేరి 13వ తేదీ తిరుమలకు చేరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షడు డీఈ రమే్‌షకుమార్, పేట రథోత్సవ కమిటి అధ్యక్షుడు రాయల్ గోపాల్, భాస్కర్, అశోక్, నరేష్, నటేష్, ఆర్సీ జయసింహ, రమే్‌షరెడ్డి, పార్థసారథి, గతిస్వం శివ, చోళేమర్రి రామకృష్ణ ఆకుల సూరి, వందలాది మంది భక్తులు హాజరయ్యారు.