గరుడ వాహనంపై శ్రీనివాసుడు

ABN , First Publish Date - 2022-10-01T05:57:57+05:30 IST

నగరంలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి.

గరుడ వాహనంపై శ్రీనివాసుడు
గరుడ వాహనంపై ఆర్‌ఎఫ్‌ రోడ్డులోని శ్రీనివాసుడు

అనంతపురం కల్చరల్‌, సెప్టెంబరు 30: నగరంలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఐదో రోజు శుక్రవారం శ్రీనివాసుడు గరుడ వాహనంపై ఆశీనుడై భక్తులను అనుగ్రహించాడు. ఆర్‌ఎఫ్‌ రోడ్డులోని లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయం, హౌసింగ్‌ బోర్డు వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో స్వామివారికి అభిషేకాలు, కుంకుమార్చనలు, తోమాలసేవలు, అలంకారసేవలు నిర్వహించారు. ఆలయాల ఆవరణలో నవగ్రహ, దీక్షా హోమాలను నిర్వహించారు. సాయంత్రం గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామిని ఊరేగించారు.

Read more