వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం
ABN , First Publish Date - 2022-08-08T05:31:49+05:30 IST
పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనసింహస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి ఆర్జిత కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించా.

కదిరి, ఆగస్టు 7: పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనసింహస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి ఆర్జిత కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించా. ఈ సందర్భంగా అర్చకులు స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పటువస్ర్తాలు, కదిరి మల్లెలు, తులసి, ప్రత్యేక పూలమాలలతో అలంకరించారు. వైఖానసి ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు కానుకలు సమర్పించారు. ఆలయ సిబ్బంది ఆలయమర్యాదలతో కల్యాణంలో పాల్గొన్న వారిని సత్కరించారు.