-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Spoiled Eggs Distribution to children-MRGS-AndhraPradesh
-
చెడిపోయిన గుడ్లు- పిల్లలకు పంపిణీ
ABN , First Publish Date - 2022-09-20T05:25:25+05:30 IST
మండలం లోని రెడ్డివారిపల్లి లోని అంగనవాడీ కేంద్రంలో ప్రభుత్వనుంచి వచ్చిన కోడిగుడ్లను గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సోమవారం పంపిణీ చేశా రు.

అమడగూరు,సెప్టెంబరు 19: మండలం లోని రెడ్డివారిపల్లి లోని అంగనవాడీ కేంద్రంలో ప్రభుత్వనుంచి వచ్చిన కోడిగుడ్లను గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సోమవారం పంపిణీ చేశా రు. పంపిణీ చేసిన గుడ్లలో దాదాపు 75శాతం చెడిపో యినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే, ఈ నెల 5వ తేదీన ఏజెన్సీనుంచి తమకు వచ్చాయని, వాటిని పంపిణీ చేస్తున్నామని, ఇందులో తమ తప్పు ఏమీ లేదని అంగనవాడీ కార్యకర్త తెలిపారు. చెడిపోయిన గుడ్లు ఇవ్వడం వలన పిల్లలు, గర్భిణు లు, బాలింతలు అనారోగ్యానికి గురవుతారని, ఇలాంటి గుడ్లు ఇస్తేఎలా అని గ్రామస్థులు మండిపడ్డారు. అంతేకాకుండా ఏజెన్సీ నిర్వాహకులు కోడిగుడ్ల పంపిణీలో అలసత్వం వహిస్తూ కొత్తగా వచ్చిన గుడ్లను పక్కన పెట్టుకుని, చెడిపోయిన గుడ్లు పంపిణీ చేస్తున్నట్లు గ్రామస్థు లంటున్నారు. ఇదేనా ప్రజా ఆరోగ్యమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.